అడవి పందులను చంపి తినొద్దు

అడవి పందులను చంపి తినొద్దు


- తినాలని పొరపాటుగా అన్నాను

- భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మురళి


భూపాలపల్లి: అడవి పందులను ఇష్టం వచ్చి నట్లుగా చంపి తినడానికి అనుమతి లేదని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ ఆకునూరి మురళి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ టి.బి దినోత్సవం సంద ర్భంగా ఈ నెల 24న ఏటూరునాగారంలో నిర్వహించిన కార్యక్రమంలో తాను మాట్లా డిన మాటల్లో పొరపాటు దొర్లిందని కలెక్టర్‌ అంగీకరించారు.



పౌష్టికాహారం తినడం వలన రోగాల బారిన పడకుండా ఉండవ చ్చని చెప్పే క్రమంలో అడవి పందుల మాంసం తినాలని పొరపాటుగా అన్నట్లు పేర్కొన్నారు. అటవీ చట్టాలు, వన్య ప్రాణుల సంరక్షణ చట్టాలను అనుసరించి అడవి జంతువులను చంపడం, తినడం నేరమని తెలిపారు. ప్రభుత్వం డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారి అనుమతి పొంది పీసీసీఎఫ్‌ కార్యాల యం, హైదరాబాద్‌ వారు గుర్తించిన, శిక్షణ పొందిన షూటర్‌ ద్వారా మాత్రమే అడవి పందులను చంపడానికి అనుమతి ఇచ్చింద న్నారు. ప్రజలు అడవి పందులను చంపి తినడానికి అనుమతి లేదని, తన పొరపా టును గమనించాలని ప్రకటనలో కోరారు.


(భూపాలపల్లి కలెక్టర్‌పై చర్యలు: జోగురామన్న)

(చదవండి: అడవి పంది, గొడ్డు మాంసం తినండి)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top