విభజించి పాలించడం వల్లే ఈ సమస్య: మోదీ

విభజించి పాలించడం వల్లే ఈ సమస్య: మోదీ - Sakshi


బ్రిటిష్ పాలకులు అవలంబించిన 'విభజించి పాలించు' అనే విధానమే నాగాలాండ్లో సమస్యకు ప్రధాన కారణంగా నిలిచిందని,  ఈశాన్యా రాష్ట్రాల శాంతిభద్రతలు, అక్కడి అభివృద్ధి తన ఎజెండాలో అత్యంత ప్రధానమని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. నాగాలతో అత్యంత కీలకమైన శాంతి ఒప్పందం కుదిరిన సందర్భంగా ఆయన తన అధికారిక నివాసమైన నెం.7 రేస్కోర్సు రోడ్డులో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..


  • ఈ చారిత్రక సందర్భంలో వచ్చినవారందరికీ అభినందనలు

  • అనారోగ్యం కారణంగా ఐసెక్ స్వు ఈ కార్యక్రమానికి రాలేకపోవడం దురదృష్టకరం

  • నాగా రాజకీయ సమస్య దాదాపు 6 దశాబ్దాల పాటు ఇబ్బందిపెట్టింది

  • దీంతో కొన్ని తరాల ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు

  • ఐసెక్ సు, ముయివా లాంటివాళ్లు సహకరించడం వల్లే ఈ చారిత్రక ఒప్పందం కుదిరింది

  • ఎన్ఎస్సీఎన్ దాదాపు రెండు దశాబ్దాల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించింది. అందుకు కృతజ్ఞతలు

  • నేను నాగాలాండ్కు చాలాసార్లు వెళ్లాను. వాళ్లు చాలా అద్భుతమైన మానవత్వం చూపించారు

  • బ్రిటిష్ పాలకుల కారణంగానే నాగా ప్రజలు ఇన్నాళ్లుగా దేశానికి దూరంగా ఉన్నారు

  • వాళ్లు కావాలనే నాగాల గురించి భారతదేశంలోని ఇతర ప్రాంతాల వాళ్లకు చెడుగా చెప్పారు

  • వాళ్ల విభజించి పాలించే లక్షణమే ఇలా చేసింది

  • మహాత్మా గాంధీ లాంటి చాలామంది నాగాలను ప్రేమించారు, వాళ్ల సెంటిమెంట్లను గౌరవించారు

  • ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి చాలాకాలం పాటు అసలు జరగలేదు

  • ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి నా ప్రాధాన్యాల్లో ముందున్నాయి

  • నాగా నాయకులతో చర్చించేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాను

  • వాళ్ల ఆలోచనలు, సెంటిమెంట్లను గౌరవిస్తూ.. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా ముందుంటామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నా.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top