భీమ్‌ యాప్‌ డౌన్‌లోడ్స్‌ ఎన్నో తెలుసా?

భీమ్‌ యాప్‌  డౌన్‌లోడ్స్‌ ఎన్నో తెలుసా? - Sakshi


న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల యాప్‌  భీం(బీహెచ్‌ఐఎం)  రికార్డ్‌ స్థాయిలో  దూసుకుపోతోంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రారరంభించిన డిజిటల్ పేమెంట్స్ యాప్ కు భారీ ఆదరణ లభిస్తోంది డౌన్‌ లోడ్స్‌లో 17 మిలియన్లను దాటిందని నీతి ఆయోగ్‌  సీఈవో అమితాబ్ కాంత్  ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో  ఆయన  ఈ విషయాలను ప్రకటించారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లైన ఈ యాప్‌ను ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నార‌న్నారు. తొలుత  ఈ యాప్‌కు   సాంకేతికంగా కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయని చెప్పిన కాంత్‌   అవి ఇప్పుడు గణనీయంగా తగ్గాయని చెప్పారు.  అలాగే ప్ర‌స్తుతం ఈ యాప్ కోసం ఐవోస్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామ‌ని చెప్పారు. దీంతో పాపులర్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.

 

అలాగే గత ఏడాది నవంబరు, డిసెంబర్ ‌కాలంలో యూఎస్ఎస్‌డీ  ఆధారిత ట్రాన్సాక్షన్లు  (ఫీచర్ ఫోన్లో బ్యాంకింగ్ సేవలకు పయోగించే  మొబైల్ కోడ్ సందేశం) 45 శాతం పెరిగాయ‌ని, న‌వంబ‌రు 8కి ముందు భార‌త్‌లో 8 లక్షల పీవోఎస్ మిషన్లు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 28 లక్షలకు పెరిగింద‌ని అమితాబ్ కాంత్ వెల్ల‌డించారు.



కాగా డీమానిటైజేషన్‌ అనంతరం డిశెంబర్‌ 30 లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంచ్‌   బీమ్‌ యాప్‌ ను లాంచ్‌ చేశారు.   డిజిటల్‌ చెల్లింపులకు ప్రోత్సాహ అందించే దిశగా  ఈయాప్‌ ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ముఖ్యంగా మొబైల్‌  వాలెట్స్‌, యూఎస్ఎస్‌డీ,రూ పే లాంటి   డిజిటల్ చెల్లింపులకు గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top