రూ.3,699 లకే ఢిల్లీ-హైదరాబాద్ విమాన టికెట్

రూ.3,699 లకే ఢిల్లీ-హైదరాబాద్ విమాన టికెట్


 న్యూఢిల్లీ: టాటాలకు చెందిన విస్తారా విమానయాన సంస్థ ప్రయాణికులకు కోసం టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ ‘బుక్ ఎర్లీ అండ్ సేవ్ మోర్’ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో టికెట్లను 90 రోజుల ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కింద కంపెనీ రూ.2,129-రూ.5,529ల ధర శ్రేణిలో విమాన టికెట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ కింద విస్తారా ఢిల్లీ-హైదరాబాద్ టికెట్‌ను 3,699లకు అందిస్తోంది. అలాగే ముంబై-అహ్మదాబాద్ టికెట్ ధర రూ.2,129గా, ఢిల్లీ-గోవా టికెట్ ధర రూ.5,529గా, ఢిల్లీ-గువాహటి టికెట్ ధర రూ.4,459గా, ఢిల్లీ-బాగ్ డోగ్రా (డార్జిలింగ్) టికెట్ ధర రూ.4,399గా, న్యూఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.3,539గా ఉంటాయని కంపెనీ తెలిపింది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top