పతంజలికి మరో షాక్‌!

పతంజలికి మరో షాక్‌! - Sakshi


న్యూడిల్లీ: భారీ టార్గెట్‌తో ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లోకి  దూసుకొచ్చిన యోగా  గురు రాందేవ్‌బాబా సంస్థ పతంజలికి మరో  షాక్‌ తగిలింది.  ప్రకృతి సిద్ధం, ఆయుర్వేదం అని చెప్పుకునే  పతంజలి బ్రాండ్‌ నేమ్‌ మరోసారి  చిక్కుల్లో పడింది. పతంజలి పాపులర్‌ బ్రాండ్‌ ఆమ్లా జ్యూస్‌పై  కోలకతా ల్యాబ్‌ అభ్యంతరాలు  లేవనెత్తింది.   దీంతో  భారతదేశం  డిఫెన్స్‌ రంగానికి చెందిన  రిటైలింగ్ వేదికల్లో పతంజలి  అమ్లా జ్యూస్ అమ్మకాలను నిలిపివేసింది.  సీఎస్‌డీ క్యాంటీన్లలో  ఈ జ్యూస్‌ విక్రయాలను సస్పెండ్‌ చేస్తూ అధికారులు  ఆదేశాలు జారీ  చేశారు. కోల్‌కతా సెంట్రల్ ఫుడ్ ల్యాబ్ తాజా నివేదిక ఆధారంగా సీఎస్‌డీ ఈనిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాల క్రితం నెస్లే మాగి నూడుల్స్ పై సంచలన ఆరోపణలు చేసిన  ల్యాబ్‌ ఈ అభ్యంతరాలను వ్యక్తం చేయడం గమనార్హం. 



మ్యాగీ నూడల్స్‌లో  ప్రమాదకర  లెడ్‌ లెవల్స్‌ అధికంగా ఉన్నాయని  ప్రకటించిన ల్యాబ్‌  తాజాగా పతంజలి ఆమ్లా జ్యూస్‌పై కొరడా ఝళిపించింది.  దీంతో డిఫెన్స్‌కు  చెందిన  క్యాంటీన్‌  స్టోర్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌( సీఎస్‌డీ) లలో అమ్మకాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.   ఈ మేరకు ఏప్రిల్‌ 3, 2017న రాసిన ఒక లేఖ రాసింది. అన్ని సీఎస్‌డీ డిపోలలోఉన్న పతంజలి ఆమ్లా జ్యూస్‌ కు సంబంధించిన స్టాక్‌ వివరాలను అందించాలని  సంబంధిత అధికారులు ఆదేశించారు. వీటిని  రిటన్‌ ఇచ్చేందుకు  డెబిట్‌ నోట్‌ తయారు చేయాల్సిందిగా కోరారు. మ్యాగీ నూడుల్స్లో పరిమితికి మించి సీసీం (లెడ్), మోనో సోడియం గ్లూటమేన్ ఉన్నాయని  ఈ ల్యాబ్‌  పరీక్షల్లో వెల్లడైందిన దీంతో  మ్యాగీ నూడుల్స్ ను వెనక్కితీసుకున్న నెస్లే  వేల కోట్ల రూపాయలను నష్టపోయింది.


1948లో  ఈ సీఎస్‌డీ క్యాంటీన్‌ లు ప్రారంభించబడ్డాయి. మాజీ సైనికులు, వారికుటుంబాలతో సహా డిఫెన్స్‌రంగంలోని సుమారు 12 మిలియన్లమంది ఈ సీఎస్‌డీ సేవలను వినియోగించు కుంటుండగా,   దాదాపు 5,300 రకాలు ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తారు.   


కాగా రూ.5వేల కోట్ల బిజినెస్‌ టర్నోవర్‌తో సాగుతున్న పతంజలి ఉత్పత్తులపై ఆరోపణలు ఇదేమొదటిసారి కాదు. ఇటీవల  అనుమతి లేకుండానే పతంజలి న్యూడల్స్‌, పాస్తా   విక్రయిస్తోందని  ఫుడ్‌ సెక్యూరిటీ స్టాండర్ట్స్‌  అధారిటీ ఆఫ్‌​ ఇండియా  ఆరోపించింది. అలాగే  గతంలో వంటల నూనెల ప్రకటనలో వినియోగదారులను తప్పు దారి పట్టిస్తోందని మొట్టికాయలు వేసింది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసిన సంగతి  విదితమే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top