నువ్వు ఒంటరివి కావు- హీరోయిన్
వైట్‌ఫీల్డ్: ప్రముఖ నటి దీపికా పదుకొనె స్థాపించిన ది లైవ్ లివింగ్ లాఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లో 276 విద్యాలయాల్లో 6,480 టీచర్ల ద్వారా 34 వేల మంది విద్యార్థులకు ఆమె స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించారు. నువ్వు ఒంటరివి కావు (యు ఆర్ నాట్ అలోన్) అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏడాది నుంచి ముందుకు నడిపిస్తున్నారామె. ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు మీడియాతో సంభాషించారు.
విద్యార్థులకు కౌమార దశలో ఎలాంటి మానసిక ఆందోళన, ఒత్తిడి వంటివి పీడిస్తున్నా వాటిని తొలగించుకోవడానికి ఈ బోధన ఉపకరిస్తుందని అందాలతార తెలిపారు. మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షణకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలలో విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకు పాఠశాలల యాజమాన్యాలు సహకరిస్తున్నాయని తెలిపారు.