ఎస్‌వీఎస్ విద్యార్థినులది హత్యేనా?

ఎస్‌వీఎస్ విద్యార్థినులది హత్యేనా? - Sakshi


సాక్షి, చెన్నై: విల్లుపురం ఎస్‌వీఎస్ కళాశాల విద్యార్థినుల మృతికేసు మలుపు తిరిగింది. ఇది ముమ్మాటికి హత్యే అన్న వాదనలకు బలం చేకూరే రీతిలో కోర్టుకు పోస్టుమార్టం నివేదిక చేరింది. ఊపిరి ఆడక పోవడం వల్లే మరణించినట్టుగా నివేదిక లో పేర్కొనబడి ఉండడం కేసును మలు పు తిప్పి ఉన్నది.  అలాగే, బావిలో దూకి మరణించి ఉంటే, ఊపిరి తిత్తుల్లోకి నీళ్లు చేరి ఉండేదని పేర్కొన బడి ఉండడంతో ఆ ముగ్గురిదీ హత్యే అన్న వాదనకు బలం చేకూరినట్టు అవుతోంది.

 

విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చిలోని ఎస్‌వీఎస్ సిద్ధ వైద్య కళాశాలకు చెందిన విద్యా కుసుమాలు మోనీషా, శరణ్య, ప్రియాంకలు అనుమానాస్పద స్థితిలో బావిలో గత నెల  శవాలుగా తేలిన విషయం తెలిసిందే.  ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలాన్ని సృష్టించింది. ఈ కేసులో తొలుత ఆ  జిల్లా యంత్రాంగం ఎవర్నో రక్షించే ప్రయత్నం చేసినట్టుగా మెతక వైఖరి అనుసరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు బయలుదే రడం, విద్యార్థిలోకం కన్నెర్ర చేయడంతో కేసును ఓ సవాల్‌గా తీసుకోవాల్సి వచ్చింది.



అయితే, ఆత్మహత్య కేసుగా విచారణ సాగించినా, తదుపరి పరిణామాలతో స్థానిక పోలీసుల చేతి నుంచి కేసును సీబీసీఐడీ తన గుప్పెట్లోకి తీసుకుంది. ఈ కేసులో ఆ కళాశాల కరస్పాండెంట్ వాసుకీతో పాటుగా నలుగురు అరెస్టు అయ్యారు.  ఈ అరెస్టులతో ఆ కళాశాలకు అస్సలు గుర్తింపు లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ విద్యార్థినుల మృతి మిస్టరీగానే ఉండడంతో దర్యాప్తు వేగం పెరగలేదని చెప్పవచ్చు. తన కుమార్తె మృతిలో అనుమానాలు ఉన్నాయంటూ మోనీషా తండ్రి కోర్టును ఆశ్రయించడంతో ఆమె మృత దేహానికి మరో మారు పోస్టుమార్టం చెన్నైలో జరిగింది.

 

హత్యేనా:  మద్రాసు హైకోర్టులో విచారణలో ఉన్న మోనీషా తండ్రి తమిళరసన్ దాఖలు చేసిన పిటిషన్  సోమవారం విచారణకు వచ్చింది. కోర్టుకు  విల్లుపురం వైద్య వర్గాలు జరిపిన పోస్టుమార్టం నివేదిక చేరడం,అందులో పేర్కొన్న అంశాలు కేసును మలుపు తిప్పినట్టు చేసింది. అందులో మృతి చెందిన వారి ఊపిరి తిత్తుల్లో నీళ్లు లేవు అని పేర్కొని  ఉండడంతో ఇది ముమ్మాటికీ హత్యే అన్న వాదనలకు బలం చేకూరినట్టు అవుతోంది.



అయితే, ఊపిరితిత్తుల్లోనే నీళ్లు చేరని దృష్ట్యా, ఇది హత్యే అన్న వాదనను తమిళరసన్ తరపు న్యాయవాదులు కోర్టు ముందు ఉంచే పనిలో పడ్డారు. కాగా, ఇప్పటికే చెన్నైలో జరిగిన పోస్టుమార్టం మేరకు మోనీషా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించిం దని, ఊపిరి ఆడకుండా చేసి మరణించి నానంతరం నీళ్లలోకి తెచ్చి పడేసినట్టుం దని తమిళరసన్ తరపు వైద్యుడు సంపత్ స్పష్టం చేసి ఉండడంతో ఇది హత్యే అన్న వాదనకు బలం చేకూరినట్టు అయింది.



అయితే, నివేదికను సమగ్రంగా పరిశీలించాల్సిన అవశ్యం ఉన్న దృష్ట్యా, ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి, తదుపరి విచారణ కోర్టు  ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఉత్కంఠ బయలు దేరింది. తన కుమార్తె శరణ్య మృత దేహానికి సైతం రీ పోస్టుమార్టం జరపాలని  కాంచీపురం జిల్లా సెయ్యారుకు చెందిన ఏలుమలై కోర్టును ఆశ్రయించడంతో, ఈ పిటిషన్లన్నింటిపై మంగళవారం కోర్టు విచారణ నిర్వహించి, ఉత్తర్వుల్ని జారీ చేయనుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top