Alexa
YSR
‘అన్నం పెట్టే రైతన్నను రుణ విముక్తుణ్ని చేయడమే నా ముందున్న లక్ష్యం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వార్తలుకథ

కాళేశ్వరానికి కొర్రీలు

Sakshi | Updated: March 21, 2017 07:39 (IST)
కాళేశ్వరానికి కొర్రీలు వీడియోకి క్లిక్ చేయండి

కొత్త ప్రాజెక్టుగా ఎందుకు భావించరాదన్న సీడబ్ల్యూసీ
సాక్షి, హైదరాబాద్‌:
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) కొర్రీలు పెట్టింది. జల వినియోగం, నీటిని తీసుకునే ప్రదేశం, ప్రాజెక్టు వ్యయం పూర్తిగా మారుతున్నందున దీన్ని కొత్త ప్రాజెక్టుగా ఎందుకు భావించరాదని ప్రశ్నిం చింది. పాత ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు స్వరూపం పూర్తిగా మారినందున కాళేశ్వరాన్ని కొత్త ప్రాజెక్టు గానే భావించాల్సి ఉంటుందని తేల్చింది. దీనికి గోదావరి నదీ యాజమాన్య బోర్డు సైతం మద్దతు పలికినట్టు సమాచారం. కొత్త ప్రాజెక్టుగా పరిగణి స్తున్నందున ప్రాజెక్టు అనుమతులు పూర్తిగా గోదావరి బోర్డు ద్వారానే రావాల్సి ఉంటుందంది. అయితే దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ముమ్మాటికీ పాతదేనని చెప్పింది. గతంలో సీడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన సూచనల మేరకే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి, కాళేశ్వరం చేపట్టామంది.

గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కిన నికర జలాలను విని యోగించుకుంటూనే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగు తోందని, ఇందులో ఎలాంటి అంతర్రాష్ట్ర వివా దాలకు ఆస్కారం లేదని వెల్లడించిం ది. ముంపు అం శాలపై మహారా ష్ట్రతో వివాదాల ను సైతం పరిష్కారించుకున్నామని వివరించింది. ఈ దృష్ట్యా కాళేశ్వరం ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)కు సాంకేతిక, ఆర్థిక అనుమతు లు మంజూరు చేయాలని విన్నవించింది. కాళేశ్వ రం పథకానికి పర్యావరణ మదింపు చేసుకునేం దుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీని కలసి దీని పై అభ్యంతరాన్ని తెలిపింది. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ సోమవారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, ప్రాజెక్టు సీఈ హరిరామ్‌ హాజరయ్యారు. గోదావరి బోర్డు చైర్మన్‌ హెచ్‌కే హల్దార్, సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీ పాల్గొన్నా రు. ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రజెంటేషన్‌ ఇచ్చింది.

రెండుగా విభజించాం...
గోదావరిలో లభ్యతగా ఉన్న 1,480టీఎంసీల నికరజలాల్లో తమకు 954 టీఎంసీల వాటా దక్కిం దని, అందులో ఇప్పటికే నిజాంసాగర్, సింగూరు, ఎస్సారెస్పీ–1, కడెం వంటి ప్రాజెక్టుల కింద 433.04టీఎంసీల వినియోగం జరుగుతోందని సీడబ్ల్యూసీకి తెలంగాణ వివరించింది. మరో 477 టీఎంసీల వినియోగానికి ఎల్లంపల్లి, దేవాదుల, కంతనపల్లి, సీతారామతోపాటు కాళేశ్వరం ఎత్తిపో తల పథకాలు చేపట్టామంది. 2008లో 160 టీఎంసీల వినియోగం లక్ష్యంగా ప్రాణహిత–చేవెళ్ల చేపట్టి 2010లో కేంద్ర జల సంఘానికి డీపీఆర్‌ సమర్పించామని, వివిధ అనుమతులు పొందామ ని తెలిపింది. అయితే నీటి లభ్యత, ఆన్‌లైన్‌ రిజ ర్వాయర్ల సామర్థ్యం అనుకున్నంత లేదని సీడబ్ల్యూ సీ లేఖలు రాసిన అంశాన్ని ప్రస్తావించింది. ఈ దృష్ట్యా ప్రాజెక్టును రీడిజైన్‌ చేస్తూ రెండుగా విభ జించామని, సీడబ్ల్యూసీ సూచనలు, అంతర్రాష్ట్ర అంశాల నేపథ్యంలో కాళేశ్వరం చేపట్టామంది. వాదనలు విన్న సీడబ్ల్యూసీ.. రెండ్రోజుల్లో అభ్యం తరాలు, సూచనలు లియజేస్తామని, వాటికి సమా ధానం ఇవ్వాలని సూచించింది.


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

'హోరు' గల్లు

Sakshi Post

JK Govt Bans All Social Media Platforms For One Month

The decision is taken to curb arsonists in the valley

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC