ప్రెగ్నెంట్ అయిన టీవీ నటికి షాకిచ్చిన భర్త!
ఆమె పోయినవారమే తన అభిమానులతో ఓ శుభవార్తను పంచుకుంది. తాను ప్రెగ్నెంట్ అయినట్టు ఆనందంగా ప్రకటించింది. కానీ, వారం తిరిగేలోపు ఆమె భర్త ఆమెకు షాకిచ్చాడు. ఆమె నుంచి విడిపోయేందుకు కోర్టులో విడాకులు దాఖలు చేశాడు.
అమెరికన్ టీవీ నటి కెషియా నైట్ పులియంకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ‘కాస్బీ’ టీవీ షోతో ఫేమస్ అయిన కేషియా (37) తాను గర్భవతిని అయినట్టు గతవారం ప్రకటించింది. ఆమె ఆరునెలల కిందట మాజీ ఎన్ఎఫ్ఎల్ ఆటగాడు ఎడ్గెర్టన్ హర్ట్వాల్ను పెళ్లి చేసుకుంది. ఎడ్గర్టన్ తాజాగా అట్లాంటా కౌంటీ సుపీరియర్ కోర్టులో విడాకుల కేసు దాఖలు చేశాడు. తమ వివాహబంధం పునరుద్ధరించుకోలేనంతంగా దెబ్బతిన్నదని, తాము రాజీపడే అవకాశాలు ఎంతమాత్రం లేవని మూడుపేజీల తన పిటిషన్లో అతను పేర్కొన్నాడు. గత జనవరిలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఇటీవల వేరయ్యారు. ఇటు ఎడ్గర్టన్ గతంలోనే పెళ్లి చేసుకొని భార్యను వదిలిపెట్టాడు.
సంబంధిత వార్తలు