చిన్నారి ప్రేమకథ.. ఇళ్లకు చేరింది!

చిన్నారి ప్రేమకథ.. ఇళ్లకు చేరింది! - Sakshi


వాళ్లిద్దరూ ఆరో తరగతి చదువుతున్నరు. అప్పుడే టీనేజిలోకి వచ్చారు. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది.. అంతే, ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లిపోయారు. ఎక్కడైనా ఆశ్రయం పొందుదామని చూస్తే.. వాళ్ల స్కూలు యూనిఫాం, భుజాలకు తగిలించుకున్న బ్యాగులు చూసి ఎవరూ అద్దెకు గదులు ఇవ్వలేదు. ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగానే.. పోలీసులు వాళ్ల ఆచూకీని పట్టేశారు. వాళ్ల వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ చిన్నారి ప్రేమకథ గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది. ఓ ప్రముఖ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న పిల్లలిద్దరూ బుధవారం మధ్యాహ్నం స్కూలు నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం ఇళ్లకు రాకపోవడంతో పిల్లలు తప్పిపోయారని వాళ్ల తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు అహ్మదాబాద్కు సమీపంలోని నడియాడ్ అనే పట్టణంలో ఇద్దరి ఆచూకీ దొరికింది.



ఇద్దరిలో అబ్బాయి వద్ద సెల్ఫోన్ ఉంది. దాని సిగ్నల్ ద్వారా ఆచూకీ తెలుసుకుందామని పోలీసులు ప్రయత్నించినా.. ముందు జాగ్రత్తగా సెల్ఫోన్ స్విచాఫ్ చేశాడు. కానీ.. వాళ్ల వయసు చూసి, స్కూలు యూనిఫాం చూసి ఎవరూ ఆశ్రయం ఇవ్వకపోవడంతో వేరే మిత్రుడి సాయం తీసుకుందామని ఫోన్ చేయడానికి గురువారం మధ్యాహ్నం తన ఫోన్ స్విచాన్ చేశాడు. ఈలోపు వేరే స్నేహితుల ఇంట్లో దుస్తులు మార్చుకున్నారు. అయితే ఫోన్ సిగ్నల్ ట్రేస్ కాగానే అహ్మదాబాద్ సైబర్ క్రైం పోలీసులు వాళ్ల ఆచూకీని పట్టేశారు. వెంటనే నడియాడ్లోని పోలీసు బృందం వాళ్లను పట్టుకుంది. ఇద్దరి తల్లిదండ్రులు కూడా వెంటనే నడియాడ్ వెళ్లారు. వాళ్లకు పిల్లిద్దరినీ అప్పగించి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చివరకు ఈ చిన్నారుల లవ్ స్టోరీ గురించి తెలుసుకుని నవ్వుకున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top