తప్పు ఒప్పుకున్న చైనా సంస్థ

తప్పు ఒప్పుకున్న చైనా సంస్థ - Sakshi


అమెరికా,యూరప్ ప్రాంతాలలో కలకలం రేపిన సైబర్ దాడికి  తమ టెక్నాలజీనే వాడుకున్నట్టు నిఘా వీడియో కెమెరాల విడిభాగాలు  ఉత్పత్తిచేసే చైనా సంస్థ   ప్రకటించింది.   ట్విట్టర్, అమెజాన్   స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్, టంబ్లర్, రెడిట్ లాంటి  వందల ప్రముఖ వెబ్ సైట్ల హ్యాకింగ్ కు  'మిరాయ్'  సాఫ్ట్ వేర్ లోని మాల్‌వేర్(వైరస్)ను వాడుకున్నట్టు  చైనాకు చెందిన  ప్రముఖ సీసీ టీవీల తయారు  సంస్థ హాంగ్జూ జియాంగ్ మయి అనే టెక్నాలజీ సంస్థ ఒప్పుకుంది.  తమ అజాగ్రత్త  మూలాంగానే  తాము  తయారుచేసిన సీసీ టీవీల ద్వారా, ఈ  సైబర్ దాడి జరిగినట్టు  స్పష్టం చేసింది. ఇంటర్నెట్ కు సంబంధించి మిరాయ్ పెద్ద విధ్వంసకారి అని  జియాంగ్ ప్రతినిధి కూపర్ వాంగ్ వ్యాఖ్యానించారు. దీన్ని అక్రమంగా వాడుకున్న హ్యాకర్లు తమకూ కష్టాలు తెచ్చిపెట్టారని,  తామూ నష్టపోయామని ఒప్పకుంటున్నా మన్నారు.   డిఫాల్ట్ పాస్ వర్డ్ ని మార్చుకోని డివైస్ లపై  ఈ వైరస్ సహాయంతో హ్యాకర్లు దాడిచేశారని తెలిపింది.  డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్‌ల (డీడీఓఎస్)లో మిరాయ్ వైరస్  ద్వారా చొరబడ్డట్టు పేర్కొంది.  గత ఏడాది  తాము ఈ లోపాన్ని గుర్తించామని, అప్పటినుంచి హ్యాకర్లు తమపై దాడి చేస్తూనే ఉన్నారని వెల్లడించింది.  సెప్టెంబర్ 2015 తరువాత తయారైన తమ కెమెరాలలో ఈ లోపాన్ని గుర్తించామని, యూజర్లు ఈ సాఫ్ట్ వేర్  ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. ఈవిషయాలను సీఎన్ఎస్ మనీ రిపోర్టు చేసింది.  


మరోవైపు సమాచారాన్ని దొంగిలించే ఈమెయిల్స్(ఫిషింగ్ మెయిల్స్)లోని కంప్యూటర్ లేదా నెట్‌వర్క్‌లపై దాడి చేస్తారు. అనంతరం డిజిటల్ వీడియో రికార్డర్లు(డీవీఆర్), కేబుల్ సెట్ టాప్ బాక్సులు, రూటర్లు, వెబ్ కెమెరాలకు వైరస్ వ్యాపిస్తుంది. ప్రస్తుత దాడి ఇలానే జరిగిందని నిపుణులు  అంచనావేశారు. మిరాయ్ ప్రోగ్రాం కోడ్ నెల క్రితమే ఇంటర్నెట్‌లో పెట్టారని,  హ్యాకర్లు ఆ కోడ్‌ ద్వారా సైబర్ దాడులకు పాల్పడుతున్నారని   ఫ్లాష్ పాయింట్ భద్రతా పరిశోధన డెరైక్టర్ అల్లిసన్ నిక్సన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top