Alexa
YSR
'తెలుగువారి గుండె చప్పుడు వినగలిగే ఆత్మీయుడిగా ఉంటే చాలు.. నా జన్మ ధన్యమైనట్టే'
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వార్తలుకథ

చైనాలో భారీ నిధి గుర్తింపు

Sakshi | Updated: March 21, 2017 15:49 (IST)
చైనాలో భారీ నిధి గుర్తింపు వీడియోకి క్లిక్ చేయండి

బీజింగ్‌: దాదాపు 300 సంవత్సరాల క్రితం నీటిపాలైన అపార సంపదను చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిధిలో 10వేలకు పైగా వెండి, బంగారు వస్తువులున్నాయని చెప్పారు. నైరుతి చైనాలోని సిచువాన్‌ ప్రావియెన్స్‌ సమీపంలోని నదిలో ఈ నిధిని గుర్తించామన్నారు. ఇందులో ఎక్కువగా నాణేలు, నగలు ఉన్నాయని, వీటితోపాటు కంచు, ఇనుముతో చేసిన కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయని చెప్పారు. మిన్‌జియాంగ్‌ నదికి ఉపనదిగా పిలిచే జిన్‌జియాంగ్‌ నది గర్భంలో ఈ సంపద బయటపడిందని సిచువాన్‌ ప్రావిన్షియల్‌ కల్చరల్‌ రెలిక్స్‌ అండ్‌ అర్కియాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ గావో డాలన్‌ తెలిపారు.

1646లో ఈ ప్రాంతాన్ని పాలించిన ఝాంగ్‌ జియాంఝాంగ్‌... మింగ్‌ సైన్యానికి భయపడి సంపదను వెయ్యి పడవల్లో మరోచోటుకు తరలిస్తుండగా అందులో కొన్ని పడవలు నీటిలో మునిగిపోయాయని, ఆ సంపదే ఇప్పుడు బయట పడిందన్నారు. సాధారణంగా వేసవి సమీపించడంతో నదీ పరిసర ప్రాంతాల్లో పురాతత్వశాస్త్రవేత్తలు తవ్వకాలను ప్రారంభిస్తారు. ఈ ఏడాది కూడా మొదలు పెట్టడడంతో ఈ నిధి బయటపడింది.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

జనమంతా ఖుష్‌

Sakshi Post

BJP, Congress Slam Kejriwal Over Promise To Abolish House Tax

Opposition BJP and Congress on Saturday dubbed Delhi Chief Minister Arvind Kejriwal’s promise to abo ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC