లాటరీల పద్ధతిలో రేప్‌లు చేశారు!

లాటరీల పద్ధతిలో రేప్‌లు చేశారు!


ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదుల అకృత్యాలపై హ్యూమన్ రైట్స్ నివేదిక

 సిరియా: వారిది ముక్కుపచ్చలారని వయస్సు, దేవుడెవరో, రాక్షసుడెవరో తెలియదు. అంతా ఎనిమిదేళ్ల నుంచి 12 ఏళ్ల ప్రాయం వారే. ఇస్లామిక్ ఉగ్రవాదులు వారిని వంతుల వారిగా రేప్ చేశారు. లాటరీ పద్ధతిలో ఎంపిక చేసుకొని మరీ దారుణాతి దారుణాలకు పాల్పడ్డారు. తమ కామకృత్యాల అనంతరం వారిలో కొందరిని గ్రామంలోని ఇతర కామాంధులకు వేలం కూడా వేశారు. ఆత్మహత్య చేసుకుందామనుకున్న వారికి ఆ దేవుడు కూడా సహకరించలేక పోయాడు. ఇస్లామిక్ రాజ్యం స్థాపన కోసం పోరాడుతున్నట్టు చెప్పుకుంటున్న ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల చెర  నుంచి తప్పించుకుని బయటపడిన ‘యాజిది’ తెగకు చెందిన బాలికల దీనగాధ ఇది. అలా తప్పించుకున్న 20 మంది బాలికలు, యువతులను మానవ హక్కుల సంఘం ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ ఇంటర్వ్యూ చేసి ఈ వివరాలను వెల్లడించింది.



ఓ 12 ఏళ్ల బాలికను కట్టేసి, చితక్కొట్టి ఏడుగురు ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు వంతులువారిగి రేప్ చేసిన అంశాన్ని ఆ మానవ హక్కుల సంఘం ఓ నివేదికలో వెల్లడించింది.  ‘నన్ను సిరియాలోని ఓ ఇంటిలో నిర్బంధించారు. నాతోపాటు మరికొంత మంది పిల్లలు ఉన్నారు. మేమున్న గదిలోని ఐఎస్‌ఐఎస్ ఫైటర్లు వచ్చారు. వారు చెప్పినట్టు చేయకపోవడంతో చెంపమీద కొట్టారు. స్నానం చేసి తయారవుతామని వారిని ఎలాగో ఒప్పించాం. ఈ గదిలో ఓ టాక్సిక్ ఆసిడ్ డబ్బా కనిపించింది. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామనుకున్నా. నాతోపాటు గతిలోవున్న ఇతర అమ్మాయిలు కూడా చచ్చి పోదామనుకున్నారు. వారికి కూడా ఇచ్చాను. నేను కూడా తాగాను. కాని మేమెవరమూ చనిపోలేదు.



అస్వస్థతకు గురయ్యాం’ జలీలా (పేరు మార్చారు) అమ్మాయి తెలిపింది. అయినా అనరోగ్యంతోవున్న వారిని కూడా తీవ్రవాదులు వదిలిపెట్టలేదని, అమెను, ఆమెతోపాటున్న మరో న లుగురు బాలికలను ఏడుగురు ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు పలుసార్లు రేప్ చేశారని హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది. యాజిది తెగకు చెందిన జలీలాను 2014, ఆగస్టు నెలలో సింజార్ గ్రామంలో ఓ ఇంటి నుంచి తీవ్రవాదులు  ఎత్తుకెళ్లారని, ఆమెతోపాటు ఏడుగురు కుటుంబ సభ్యులను కూడా కిడ్నాప్ చేశారని ఆ సంఘం పేర్కొంది. తీవ్రవాదుల చెర నుంచి తప్పించుకున్న 20 మంది యువతుల అనుభవాలు దాదాపు ఇంతే దారుణంగా ఉన్నాయి. వారికి దేవుడెలా ఉంటాడో తెలియలేదుగానీ రాక్షుసులెలా ఉంటారో తెలిసింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top