భారత ఐటీలో బ్లడ్‌బాత్‌? కంపెనీల పరిస్థితి

భారత ఐటీలో బ్లడ్‌బాత్‌? కంపెనీల పరిస్థితి


న్యూఢిల్లీ: అమెరికా టెక్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ , దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో  ఇటీవల భారీగాఉద్యోగులపై ఉద్వాసన పలుకుతున్నాయనే వార్తలు ఉద్యోగలను కలవరపరిచింది.  ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు తోడు, దేశీయంగా  ఐటీ(ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ)రంగంఎదుర్కొంటున్నసవాళ్లు వేలమంది ఉద్యోగుల భవిష్యత్‌పై పలు ప్రశ్నల్ని లేవనెత్తింది.



ఐటీ దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కేప్‌జెమినిల్లో ఉద్యోగమంటే  యువతకు యమ  క్రేజ్‌.  దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 9.3 శాతం వాటాతో  మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్నమనదేశంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న రంగం ఐటీ .  దేశంలో 40 లక్షలమందికి ప్రత్యక్షజీవనోపాధిగానూ, మరో 20 లక్షల మంది పరోక్షంగానో ఈ రంగం ఉపాధిని కల్పిస్తుంది. ప్రపంచ ఐటీ రంగానికి 57 శాతం ఔట్‌సోర్సింగ్‌ భారత్‌ ఐటీ రంగం నుంచే జరుగుతుంది. ఒక్క 2016 సంవత్సరంలో ఐటీకంపెనీల రెవెన్యూ 14,300 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.



కాగ్నిజెంట్‌ మొదలు... విప్రో వరకూ..!

గత మార్చి 20న కాగ్నిజెంట్‌ కాగ్నిజెంట్‌ తన ఉద్యోగుల్లో 6వేల మందిపై  వేటు వేయనున్నట్లు ప్రకటించింది. అటు  దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్, ఫ్రెంచ​ ఐటీ మేజర్‌ కాప్‌ జెమిని ఉద్యోగాల్లో కోత విధించకుండా రక్షణా‍త్మక ధోరణి అవలంబించాయి. ఈ ఏడాది తొలి 9నెలల్లో కేవలం 5వేల మందిని మాత్రమే కొత్త ఉద్యోగులను నియమించుకుంది. ఇన్ఫోసిస్‌ ప్రక్రియతో ఐటీరంగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపకపోయినా, పరోక్షంగా ఆందోళన కలిగించే విషయని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. మరో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం విప్రో కూడా ఉద్యోగాల ఉద్వాసన విషయంలో కాగ్నిజెంట్‌నే అనుసరించనుంది. వార్షిక పనితీరు ప్రక్రియం అనంతరం సుమారు 600 నుంచి 2,000 మందిని ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది.



క్యాప్‌ జెమినీ శిక్షణ

డిజిటల్ ,  క్లౌడ్‌ లో కొత్త నైపుణ్యాలలో సుమారు లక్షమంది  ఉద్యోగులకు  శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు, ఫ్యూచర్‌కు  తమ  ఉద్యోగులను రడీ చేయడమే లక్ష్యమని  ఫ్రాన్స్‌కుచెందిన  ఐటి సేవల సంస్థ క్యాప్‌ జెమిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్విన్ యార్డీ ఒక వార్తా సంస్థతో చెప్పారు.



దాదాపు 60 వేలమందికి శిక్షణ పూర్తి అయిందని,  డిజిటల్ టెక్నాలజీల వాడకంలో నైపుణ్యంలో లేని మధ్య మరియు సీనియర్ స్థాయిలలో అత్యధిక ఉద్యోగాలు నష్టపోయే ప్రమాదముందని  క్యాప్‌ జెమినీ ఇండియా అధిపతి శ్రీనివాస్‌ కందుల ఇటీవల  హెచ్చరించడం గమనార్హం.



ఆటోమేషన్‌నే అసలు కారణమా..?

వ్యయాలను తగ్గించుకోవడానికి కంపెనీలు ఆటోమేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఈ ఐటీరంగంలో పని చేసే లక్షలాది మంది భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. దిగ్గజ ఐటీ కంపెనీలు డిజిటైజేషన్‌, ఆటోమేషన్‌పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పరిస్థితు‍ల్లో ఖర్చును తగ్గించుకోవడానికి ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. ఆటోమేషన్‌ వల్ల ఈ ఏడాదిలో ఐటీ ఉద్యోగాల నియామకాలు 40 శాతం తగ్గవచ్చని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.



 ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం వల్లే: నాస్కాం ప్రెసిడెంట్‌: ఆర్‌.చంద్రశేఖర్‌  

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం మెదలైంది. స్థానికులకు ఉపాధి కల్పన, పాలసీల రూపకల్పన ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిని మెరగుపచాలన్నది ఈ ఉద్యమం ముఖ్యలక్షణం. ఈ ఉద్యమాన్ని ఒక్కోదేశం ఒక్కో రకంగా చేస్తోంది. ‘‘అమెరికా హెచ్‌1బీ వీసా నిబంధనలు మార్పు, ఆస్ట్రేలియా, సింగపూర్‌ వర్క్‌ వీసాల పాలసీని రద్దు’’ ఇవన్నీ అందులో బాగమే. అందువల్ల ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, కొత్త నియామకాలను నిలిపివేయడం, తగ్గించుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయని నాస్కాం ప్రెసిడెంట్‌ ఆర్‌. చంద్రశేఖర్‌ అభిప్రాయపడ్డారు.



 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top