ఐఎస్లో చేరదామని వెళ్లిన ఆషిఖ్...
లండన్: 20 ఏళ్ల బ్రిటిష్ ముస్లిం యువకుడు జకారియా ఆషిఖ్ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ భావాలకు ఆకర్షితుడయ్యాడు. వెంటనే సిరియా వెళ్లి... ఆ సంస్థలో చేరాలనుకున్నాడు. అందుకోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుని... హీత్రూ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ విషయం తెలిసిన పోలీసులు అతడిని విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.
లండన్లో గతేడాది నవంబర్ 6న ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆషిఖ్ ని లండన్ వెల్స్ ద సెంట్రల్ క్రిమినల్ కోర్టులో హజరుపరిచారు. అనంతరం విచారణ కొనసాగింది. ఆషిఖ్ కి ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఐఎస్లో చేరేందుకు ఆషిఖ్ ఆమ్స్టర్డామ్, ఫ్రాంక్ఫర్డ్, బల్గేరియా మీదగా జోర్డాన్ చేరుకోవాలనుకున్నట్లు కోర్టు విచారణలో వెల్లడైంది. దీంతో అతడికి ఆరు ఏళ్లు జైలు శిక్ష విధించింది.