లిప్స్టిక్తో బెదిరించారు!

లిప్స్టిక్తో బెదిరించారు! - Sakshi


''ఈ విమానం కార్గో విభాగంలో బాంబు ఉంది జాగ్రత్త''.. అని టర్కిష్ ఎయిర్లైన్స్ విమానానికి బెదిరింపు వచ్చింది. అయితే, ఈ బెదిరింపు ఎలా వచ్చిందో తెలుసా.. విమానంలో ఉన్న బాత్రూం అద్దం మీద ఒక లిప్స్టిక్తో ఈ మాట రాశారు. టికె-65 విమానం మొత్తం 148 మంది ప్రయాణికులతో బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తుండగా మధ్యలో ఎవరో ఈ బెదిరింపును చూసి.. పైలట్కు విషయం చెప్పారు. దాంతో వెంటనే విమానం పైలట్ నాగ్పూర్ ఏటీసీని సంప్రదించాడు. అయితే విమానాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ ఏటీసీని సంప్రదించి దించాలని వాళ్లు సూచించారు.  (తొలి కథనం.. విమానం కేబిన్ లో బాంబు)



దాంతో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కిష్ ఎయిర్లైన్స్ విమానాన్ని అత్యవసరంగా దించారు. మొత్తం ప్రయాణికులను, సిబ్బందిని కూడా భద్రతా సంస్థల అధికారులు విచారించారు. అందరి సామాన్లు, ముఖ్యంగా హ్యాండ్బ్యాగులను తనిఖీ చేశారు. ఆ లిప్స్టిక్ ఎవరి బ్యాగ్లోనైనా ఉందేమోనని చూశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా బృందాలు ఈ విచారణను కొనసాగిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం శాఖ కార్యదర్శి ఎన్సీ గోయల్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.



హైజాక్ చేసే ప్రయత్నమా?

విమానాన్ని హైజాక్ చేయాలన్న ఉద్దేశంతోనే బాంబు ఉందని బెదిరించినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముందుగా విమానంలో గందరగోళం సృష్టించి, ఆ తర్వాత దీన్ని హైజాక్ చేయాలన్నది వాళ్ల ఉద్దేశమని భావిస్తున్నారు. విమానాన్ని ఐసోలేటెడ్ బే ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ దాన్ని తనిఖీ చేస్తున్నారు. ఎయిర్పోర్టు వద్ద నేషనల్ సెక్యూరిటీ గార్డులతో సహా అన్ని నిఘా సంస్థల అధికారులు మోహరించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top