బుల్లెట్లకు బెదరని బీఎండబ్ల్యూ..

బుల్లెట్లకు బెదరని బీఎండబ్ల్యూ..


బుల్లెట్ ప్రూఫ్ కార్లు చాలా ఉన్నాయి.. అయితే.. ఈ బీఎండబ్ల్యూ ఎక్స్5 సెక్యూరిటీ ప్లస్ వాహనం ఏకే 47ను కూడా లైట్ తీసుకుంటుందట. ఏకే 47ను సైతం తట్టుకునే కారు ఇదొక్కటేనని సదరు కంపెనీ చెబుతోంది. ఈ వాహనం తయారీలో ప్రత్యేకమైన స్టీలును వాడారట. దీంతో తూటాలు తగిలినా.. వాహనానికేం కాదు. చిత్రం చూశారుగా.. అవన్నీ బుల్లెట్ తాలూకు మచ్చలే. బాడీకే కాదు.. అద్దాలకు కూడా ఏం కాదట. మాస్కో మోటారు షోలో ప్రదర్శనకు పెట్టిన ఈ వాహనం ధర రూ. 1.5 కోట్లు దాకా ఉండొచ్చని చెబుతున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top