పెట్రోల్‌ షాకింగ్‌ ప్రైస్‌: లీ.రూ.30 దిగువకు

పెట్రోల్‌ షాకింగ్‌ ప్రైస్‌:  లీ. రూ.30 దిగువకు


న్యూఢిల్లీ: పెట్రోల్‌ ధరలకు సంబంధించిన షాకింగ్‌ అంచనాలు  వెలువడ్డాయి. రాబోయే అయిదేళ్లలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.30 ల  కంటే  దిగువకు  పతనం  కానుందట.   అమెరికన్ ఫ్యూచరిస్ట్‌ టోనీ సెబా ప్రకారం  ఐదు సంవత్సరాలకు లీటరు  పెట్రోల్‌ రూ. 30 కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చని తెలుస్తోంది.



సోలార్‌ పవర్‌ కు భారీగా డిమాండ్‌ పుంజుకోనుందని అంచనావేసిన   సెబా తాజాగా చమురు ధరలపై తన అంచనాలను వెల్లడించా రు.  ప్రపంచ ప్రస్తుత టెక్నాలజీ పెట్రోలుపై ఆధారపడటాన్ని తగ్గించనుందని తెలిపారు.  సెబా ప్రకారం, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల కారణంగా  చమురు డిమాండ్‌ గణనీయంగా  పతనం కానుంది.   ముఖ్యంగా చమురు  బ్యారెల్‌  ధర త్వరలోనే 25 డాలర్లకు దిగిరానుంది.  ఇది 2020 నాటికి చమురు గిరాకీ  100 మిలియన్ బారెల్స్‌కు,  పది సంవత్సరాలలో 70 మిలియన్ బారెల్స్ పడిపోతుందని  సెబా అంచనా.


పాతకార్లు వినియోగంలోకి ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం భారీగా  పెరగనుందన్నారు. ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించడంతో పాటు, ఈ వాహనాల ధరలు కూడా బాగా దిగిరానున్నాయని సెబా చెబుతున్నారు. అలాగే 2030నాటికి 95శాతం  ప్రజలు  ప్రయివేటు వాహనాలను స్వస్తి చెబుతారని, దీంతో ఆటో మొబైల్‌ పరిశ్రమ తుడిచుపెట్టుకుపోతుందని పేర్కొన్నారు. అంతేకాదు  విద్యుత్తు వాహనాల రాకతో  ప్రపంచ ఆయిల్‌ పరిశ్రమ కుదేలవుతుందని అంచనావేశారు.



కాగా  సిలికాన్ వ్యాలీ వ్యవస్థాపకుడు, స్టాన్‌ఫర్డ్  కాంటినెనింగ్ స్టడీస్ ప్రోగ్రాంలో డిస్ప్ప్షన్ అండ్ క్లీన్ ఎనర్జీలో బోధకుడుగా ఉన్నారు సెబా. సౌర శక్తి మీద సేబా ఊహ నిజం కావడంతో చమురు ధరల భవిష్యత్తు పై అంచనాలు  కూడా నిజంకావచ్చని  భావిస్తున్నారు. మరోవైపు  ఈ అంచనాలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్  ఇటీవలి వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి.  2030 నాటికి భారతదేశం లో ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయని ప్రకటించారు. అలాగే 15 సంవత్సరాల తర్వాత దేశంలో ఒక్క పెట్రోల్ లేదా డీజిల్ కారు విక్రయించబడదని కేంద్ర మంత్రి  వ్యాఖ్యానించడం  గమనార్హం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top