'మావోయిస్టు కావడం నేరం కాదు'

'మావోయిస్టు కావడం నేరం కాదు' - Sakshi


కేవలం మావోయిస్టు కావడం ఏమాత్రం నేరం కాదని కేరళ హైకోర్టు భావించింది. ఓ కేసులో తీర్పు ఇచ్చే సమయంలో న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారు. దేశంలో ఉన్న చట్టాలను ఉల్లంఘించినప్పుడు మాత్రమే అవి చట్టవ్యతిరేక కార్యకలాపాలు అవుతాయని కోర్టు రూలింగ్ ఇచ్చింది. కేవలం మావోయిస్టు అయినంత మాత్రాన ఏ ఒక్క వ్యక్తినీ రిమాండుకు లేదా కస్టడీకి పంపడానికి వీల్లేదని జస్టిస్ ఎ. ముస్తాఖ్ తెలిపారు.



శ్యాం బాలకృష్ణన్ అనే వ్యక్తిని మావోయిస్టుగా అనుమానించి అతడిని అదుపులోకి తీసుకున్న కేసు విచారణ అనంతరం తీర్పు ఇచ్చే సమయంలో ఆయనీ విషయాలు చెప్పారు. ఈ కేసులో శ్యాం బాలకృష్ణన్కు లక్ష రూపాయలకు పైగా పరిహారం ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇలాంటి కేసుల్లో ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా కేరళ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top