ప్యూనుకు ఏడుకోట్ల ఆస్తులు.. రెండు పెద్దకార్లు!

ప్యూనుకు ఏడుకోట్ల ఆస్తులు.. రెండు పెద్దకార్లు! - Sakshi


సాధారణంగా బ్యాంకులో ప్యూనుకు ఎంత జీతం ఉంటుంది? మహా అయితే పదో పదిహేను వేలు. అందులో అతడి సంసారాన్ని లాక్కు రావడమే కష్టం. కానీ, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో ఓ ప్యూను ఏకంగా దాదాపు ఏడుకోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టాడు. ఆరు భారీ భవంతులు, రెండు లగ్జరీ కార్లు, ఇంకా లెక్కలేనంత సంపద అతగాడి సొంతం. అతడిపేరు కుల్దీప్ యాదవ్. గ్వాలియర్లోని అతడి ఇళ్లపై తెల్లవారుజామును 3 గంటల ప్రాంతంలో లోకాయుక్త, ఏసీబీ పోలీసులు సోదాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు దాదాపు 3 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. రాత్రికి సోదాలు పూర్తయ్యేసరికి వాటి విలువ 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా.



1983 నుంచి యాదవ్ ఓ సహకార బ్యాంకులో పనిచేసేవాడు. అప్పటినుంచి ప్రమోషన్లు కూడా ఏమీరాలేదు. ఎప్పుడూ నోరెత్తకుండా ఉండటంతో అంత ఆసి్త ఉందని కూడా ఎవరూ ఊహించలేదు. ఓ పెద్ద డూప్లెక్స్ బంగ్లా, ఐదు పెద్ద ఇళ్లు, రెండు లగ్జరీ కార్లు, నగలు, నగదు, బ్యాంకు లాకర్లు అన్నీ ఏసీబీ సోదాలో బయటపడ్డాయి. యాదవ్ ఆస్తి గురించి ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ సోదాలు చేశారు. అతడి జీతాన్ని బట్టి చూస్తే మహా అయితే 15-17 లక్షలు మాత్రమే సంపాదించాలి. కానీ ఏకంగా ఏడు కోట్లు అనేసరికి అధికారులే నోళ్లు వెళ్లబెట్టారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top