Alexa
YSR
‘పారదర్శకతతో పథకాలు అమలు చేస్తే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందుతుంది’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వార్తలుకథ

ఐఐటీలో సీటు రాలేదు గానీ, 3700 కోట్లు కొట్టేశాడు!

Others | Updated: February 17, 2017 11:31 (IST)
ఐఐటీలో సీటు రాలేదు గానీ, 3700 కోట్లు కొట్టేశాడు!
న్యూఢిల్లీ :
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 3700 కోట్ల స్కాం అది. దాదాపు ఆరున్నర లక్షల మందికి టోపీ పెట్టి మరీ సంపాదించిన సొమ్మది. లెక్కల్లో తిరుగులేని ప్రావీణ్యం ఉన్న అనుభవ్ మిట్టల్ అనే వ్యక్తి చేసిన స్కాం ఇది. ఎలాగైనా ఐఐటీలో చదవాలనుకున్న మిట్టల్.. కెమిస్ట్రీలో తగినన్ని మార్కులు రాకపోవడంతో ఆ చాన్సు పోగొట్టుకున్నాడు. తర్వాత గ్రేటర్ నోయిడాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజిలో చదివేటప్పుడే అతడికి ఈ లైకుల స్కీం (స్కాం) ఆలోచన వచ్చింది. తన హాస్టల్ గదినే మొట్టమొదటి ఆఫీసుగా చేసుకుని ఫేస్‌బుక్ లైకుల స్కాంకు తెరతీశాడు. మల్టీలెవెల్ మార్కెటింగ్ బిజినెస్ ప్రారంభించాలని తలపెట్టి, తన సొంత కంపెనీ ఒకదాన్ని ప్రారంభించాడు. మొదట్లో దీన్నుంచి మరీ అంత ఎక్కువ డబ్బు రాకపోవడంతో అతడి జీవనశైలి కూడా మామూలుగానే ఉండేది. అయితే, అది చాలదనుకుని.. తన కంపెనీని ఇంకా బాగా విస్తరించాడు. 
 
2015లో సోషల్‌ట్రేడ్.బిజ్ అనే పేరుతో ఆన్‌లైన్ బార్టర్ సిస్టమ్ పెట్టాలనే ఆలోచన అతడికి వచ్చింది.  ఆ తర్వాత లైకులతో వ్యాపారం చేయొచ్చని భావించాడు. ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. వెంటనే ప్రారంభించేశాడు. అయితే అసలు తాను పట్టుబడతానన్న ఆలోచన కూడా అతడికి ఏ క్షణంలోనూ రాలేదు. తన వ్యాపారం సక్సెస్ అవుతుందనుకున్నాడే గానీ, అందులోని చట్టపరమైన అంశాలు తెలుసుకోలేదు. 
 
2015 వరకు అతడు సాధారణ జీవితాన్నే గడిపాడు. అయితే ఆ తర్వాతి నుంచి ఒక్కసారిగా సంపద పెరిగిపోయింది. దాంతో ఆడి లాంటి అనేక లగ్జరీ సెడాన్ కార్లు కొనేపశాడు. గ్రేటర్ నోయిడాలో విలాసవంతమైన విల్లా కొన్నాడు. ఢిల్లీలోని కనాట్‌ప్లేస్ లాంటి హాట్ కమర్షియల్ ప్రాంతంలో రూ. 7 కోట్ల విలువైన షాపు ఉంది. ఇంకా బ్యాంకు అకౌంట్లలో ఎంత మొత్తం దాచాడు, ఇతర పెట్టుబడులు ఏంటోనని పోలీసులు పరిశీలిస్తున్నారు. 
 
బాలీవుడ్ సెలబ్రిటీలు సన్నీ లియోన్, అమిషా పటేల్ లాంటి వాళ్లతో కూడా కలిసి మిట్టల్ ఫొటోలు దిగాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపించాయి. వాటిని కూడా మిట్టల్ తన వ్యాపారాన్ని విస్తరించుకోడానికే ఉపయోగించాడు. ఈ మొత్తం చేయడానికి అతడికి పట్టిన సమయం కేవలం ఐదేళ్లు మాత్రమే. అధికారులు అతడిని మోసగాడని చెబుతుంటే.. అభిమానులు మాత్రం అతడిని అభినవ రాబిన్‌హుడ్ అని కూడా చెబుతున్నారు. అతడితో కలిసి ఇంజనీరింగ్ చదివినవాళ్లు.. మిట్టల్‌ను త్రీ ఇడియట్స్ సినిమాలోని ఫుంగ్‌షుక్ వాంగ్డూ లాంటివాడని కూడా అభివర్ణిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

డీప్‌..డీప్‌..డిప్రెషన్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC