'పేద ప్రజల ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సంజీవనిలా పనిచేస్తుంది. ఈ తృప్తి చాలు'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వార్తలుకథ

'మా అబ్బాయి సినిమా సూపర్బ్‌గా ఉంది'

Others | Updated: January 11, 2017 16:16 (IST)
'మా అబ్బాయి సినిమా సూపర్బ్‌గా ఉంది'

హైదరాబాద్‌: తన తనయుడు, మెగాస్టార్‌ చిరంజీవి దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ 'ఖైదీ నంబర్‌ 150' సినిమాతో రీఎంట్రీ ఇవ్వడంపై తల్లి అంజనాదేవి ఆనందం వ్యక్తం చేశారు. తన కొడుకు సినిమా సూపర్బ్‌గా ఉందని ఆమె పేర్కొన్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య  థియేటర్లలో ఆమె స్వయంగా సినిమా చూశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'తొమ్మిదేళ్ల త‌ర్వాత చిరంజీవి న‌టించిన 'ఖైదీ నంబ‌ర్ 150' సినిమా అద్భుతంగా ఉంది. 60 ఏళ్ల వ‌య‌సులోనూ డ్యాన్స్, న‌ట‌న‌తో చిరంజీవి అద‌ర‌గొట్టాడు. అంద‌రికీ నిజ‌మైన సంక్రాంతి పండుగను అందించాడు' అని అన్నారు. చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ రూపొందిన 'ఖైదీ నంబర్‌ 150' సినిమా మెగా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. మాస్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తో రూపొందిన ఈ సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు రావడం.. మంచి టాక్‌ వస్తుండటంతో మెగాఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

50 మందికి పైగా మృతి?

Sakshi Post

Kamal Haasan Lambastes PETA over Jallikattu

Kamal Haasan Lambastes PETA over Jallikattu

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC