గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా అగ్ర నటుడు

గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా అగ్ర నటుడు


ముంబై: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తరఫున గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నియమితులయ్యారు. ఆగ్నేయాసియాలో హెపటైటిస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయన సేవలను వినియోగించుకుంటామని డబ్ల్యూహెచ్‌వో ఒక ప్రకటనలో తెలిపింది.



ఈ రుగ్మతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అమితాబ్‌ ఈ సందర్భంగా తెలిపారు. తన లాగా హెపటైటిస్‌తో

ఎవరూ బాధపడకూడదనేదే ఆశయమని చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ పూనం ఖేత్రపాల్‌ సింగ్‌ మాట్లాడుతూ.. హెపటైటిస్‌ కారణంగా గర్భస్థ శిశుమరణాలు సంభవిస్తున్నాయని, వీటిని నివారించేందుకు అమితాబ్‌ బచ్చన్‌ సహకారం తీసుకుంటామని తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top