ఉద్ధవ్ కు అమిత్ షా, ఫడణ్ వీస్ ఫోన్
ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. దేవంద్ర ఫడణ్వీస్ ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని ఉద్ధవ్ ఠాక్రేను ఆహ్వానించారు.
ఫడణ్వీస్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తామని శివసేన ప్రకటించిన నేపథ్యంలో ఉద్ధవ్ కు అమిత్ షా ఫోన్ చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఉద్ధవ్ హాజరుకాకపోవచ్చని నిన్న వార్తలు వచ్చాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే కార్యక్రమంలో ఫడణ్వీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ముఖ్యమంత్రి అభ్యర్థి ఫడణ్వీస్ కూడా ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేశారు.