అంబేడ్కర్‌.. తాత ఇంట్లో నివసించారు

అంబేడ్కర్‌.. తాత ఇంట్లో నివసించారు - Sakshi


ముంబై: రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ బాల్యంలో సతారాలోని తాత ఇంట్లో కచ్చితంగా నివసించి ఉంటారని భావిస్తున్నందునే ఆ ఇంటిని రక్షిత నిర్మాణంగా ప్రకటించామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు బాంబే హైకోర్టులో మంగళవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది.



‘అంబేడ్కర్‌ తండ్రి రాంజీ మలోజీ సక్పల్‌ ఆ ప్రదేశంలో నివసించారు. ఆ ఆస్తి ఆయనకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. అంబేడ్కర్‌ పేరు ప్రతాప్‌సింగ్‌ హైస్కూల్లో నమోదైంది. అప్పుడు ఆయన ఎక్కడ నివసించాడో రికార్డుల్లో లేకున్నా.. చుట్టుపక్కల ఇళ్లేవీ లేకపోవడంతో కచ్చితంగా తండ్రితో కలసి ఆ ఇంట్లోనే జీవించి ఉంటారు’ అని వివరించింది. ఈ ఆస్తిని ప్రభుత్వం రక్షణ నిర్మాణంగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ లక్ష్మణ్‌ ఆమ్నే అనే వ్యక్తి ఇటీవల కోర్టుకెక్కారు.  దీనిపై కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top