హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్‌ ఛార్మీ

హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్‌ ఛార్మీ - Sakshi


హైదరాబాద్‌ : డ్రగ్స్‌ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్‌ ఛార్మీ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.  సిట్‌ విచారణకు సహకరిస్తానంటూ తెలిపిన ఛార్మీ అనూహ్యంగా న్యాయస్థానం తలుపుతట్టారు. ఆర్టికల్‌ 20 సబ్‌ క్లాజ్‌ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలు సేకరించవద్దంటూ ఆమె తరఫు న్యాయవాది పిటిషన్‌ వేశారు.


సిట్‌ దర్యాప్తు అభ్యంతరకరంగా ఉందంటూ ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే  ను విచారణకు హాజరయ్యే సమయంలో అడ్వకేట్‌ను వెంట తీసుకు వెళ్లే వెసులుబాటు కల్పించాలని ఛార్మీ కోరారు. ఈ పిటిషన్‌ ఇవాళ మధ్యాహ్నం విచారణకు రానుంది. కాగా ఛార్మి ఎల్లుండి (బుధవారం) సిట్‌ ఎదుట హాజరు కానున్నారు. మరోవైపు సిట్‌ నోటీసులు అందుకున్న హీరో నవదీప్‌ ఈ రోజు ఉదయం సిట్‌ అధికారుల ఎదుట హాజరయ్యారు.



మరోవైపు డ్రగ్స్‌ మాఫియా కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో లింకులున్నాయని ఆరోపిస్తూ రోజుకో సినీ నటుడిని పిలిచి 12 నుంచి 13 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ‘డ్రగ్‌ పెడ్లర్‌’అని నిరూపించేందుకు ఒక్క ప్రముఖుడి నుంచి కూడా ఆధారాలు లభించలేదని విశ్వసనీయంగా తెలిసింది. కెల్విన్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకోవడం తప్పా మరొకరికి విక్రయించినట్టుగానీ, రవాణా చేసినట్టుగానీ ఎక్కడా ఒక్క ఆధారం దొరకలేదన్నది ఎక్సైజ్‌ ఉన్నతాధికారుల నుంచి వినిపిస్తున్న మాట.


మరి బాధితులను ఇన్ని గంటల పాటు విచారించడం ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్లి విచారణ విధానం, సిట్‌పై పిటిషన్‌ వేస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళన ఎక్సైజ్‌ అధికారులలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో  ఛార్మీ హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సిట్‌ నోటీసులు అందుకున్న విచారణకు హాజరైన దర్శకుడు పూరీ జగన్నాథ్‌, కెమేరామెన్‌ శ్యామ్‌ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్‌ రక్తనమూనాలు సేకరించిన విషయం తెలిసిందే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top