షుగర్ పేషెంట్లకు శుభవార్త..!

షుగర్ పేషెంట్లకు శుభవార్త..!


ఓ తపాలా బిళ్ళ సైజులో ఉండే వేఫర్ స్ట్రిప్... ఇప్పుడు షుగర్ పేషెంట్లకు సుమారు అదే మోతాదు కలిగిన  ఇన్పులిన్ ఇంజెక్షన్ కు బదులుగా ఉపయోగపడనుంది.  అంతే వేగంగా హార్మోన్ ను అందించేందుకు కూడ ఉపయోగపడుతుందని ప్రస్తుత అధ్యయనాలు చెప్తున్నాయి. MSL-001 పేరిట రూపొందిన ఈ వేఫర్ అతి వేగంగా రక్త నాళాల ద్వారా  లోపలికి ఇన్సులిన్ ను పంపించగల్గుతుందని పరిశోధకులు గుర్తించారు. చెంప లోపలి భాగంలో నాలుక కింద చిన్న చిన్న కేశనాళికలు ఉంటాయి. వాటి సన్నని గోడల ద్వారా ఇన్సులిన్ ను ఈ వేఫర్స్ లోపలికి పంపిస్తాయి.



డయాబెటిస్ రోగులు భోజనం చేసిన వెంటనే వచ్చే బ్లడ్ షుగర్ ను నివారించేందుకు ఇన్సులిన్ ను వినియోగించాల్సి వస్తుంది. ఇందుకు పదే పదే ఇంజెక్షన్ నీడిల్ ను వాడాల్సిన వస్తుంది. అయితే ఇలా సూదులతో ఇన్సులిన్ తీసుకునే విధానాన్ని ఇష్టపడని రోగులు... ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ నూతన సాంకేతిక విధానాన్ని వినియోగించుకోవచ్చు. వేఫర్ వాడకంతో  రోజులో అనేకసార్లు ఇంజెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితినుంచీ వీరు దూరం కావచ్చు.



పాంక్రియాస్ నుంచి విడుదలయ్యే ఇన్సులిన్ కణాలు రక్తంలో ఉండే సుగర్ ను కరిగించేందుకు సహాయపడతాయి. టైప్1 డయాబెటిస్ వ్యక్తుల్లో పాంక్రియాస్ ఇన్సులిన్ ను విడుదల చేయడం పూర్తిగా మానేస్తుంది.  అదే టైప్ 2లో కణాల ఉత్పత్తికి నిరోధకంగా మారుతుంది. ఇన్సులిన్ సరైన స్థాయిలో లేనప్పుడు... రక్తంలో ఉండే అధిక చక్కెర రోగికి పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆ ప్రభావం మిగిలిన ప్రధాన అవయవాలపైనా పడుతుంది. దీంతో కేశనాళికలు కూడ దెబ్బతినే అవకాశం ఉంటుంది.  అయితే టైప్ 1 డయాబెటిస్ ఎక్కువగా యువకుల్లో దాని ప్రభావం చూపిస్తుంటుంది.


రోగ నిరోధక వ్యవస్థ క్షీణించడంతో ఆ ప్రభావం ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై కూడ పడుతుంది. దీంతో ఈ రోగులకు ఇన్సులిన్ తో  చికిత్సను అందిస్తారు. అయితే టైప్ 2 డయాబెటిస్ సాధారణంగా అందరికీ వస్తుంటుంది. ఎక్కువగా స్థూలకాయం ఉన్నవారిలోనూ, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడ ఈ రకం మధుమేహం వచ్చే అవకాశం ఉంది.  కాబట్టి ప్రతిసారీ సూదులతో ఇన్సులిన్ ఎక్కించే పరిస్థితికి దూరంగా ఉండేందుకు పరిశోధకులు వేఫర్స్ ను కనుగొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top