పులి చర్మం కోసం రూ.10 లక్షల చెక్కు

పులి చర్మం కోసం రూ.10 లక్షల చెక్కు


- సంచిలో పులి చర్మం?

- విదేశాలకు తరలిస్తున్నట్లు అనుమానం

- ఛత్తీస్‌గఢ్‌ వ్యాపారి నుంచి కొనుగోలు

- దుప్పుల వేట కేసులో కొత్త కోణం




సాక్షి, భూపాలపల్లి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దుప్పులవేట కేసులో మరో దారుణం చోటు చేసుకున్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దుప్పులను వేటాడిన నిందితులు విదేశాలకు తరలించేందుకు పులిచర్మాన్ని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యాపారి నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అటవీ శాఖ అధికారులు దాడి చేసిన తర్వాత చాకచ క్యంగా ఈ పులిచర్మాన్ని తప్పించినట్లు తెలుస్తోంది. కేసు విచారణలో పక్కదారి పట్టిన పలు అంశాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.



గన్నీ బ్యాగులో పులి చర్మం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లి వద్ద ఈ నెల 19న రాత్రి అటవీశాఖ అధికారులు దాడి చేయగా దుప్పులను వేటాడిన నిందితులు పారిపోయారు. సంఘటనా స్థలంలో టాటా ఇండికా విస్టా కారు, రెండు దుప్పు ల కళేబరాలు, ఖాళీ బ్యాంకు చెక్కు, ఫజల్‌ మహ్మద్‌ ఖాన్‌కు చెందిన ఆధార్‌కార్డు, కారు రిపేరు చేయిం చిన రసీదు, కత్తి, ఖురాన్‌ వంటి వస్తువులతోపాటు రూ.10 లక్షల విలువైన సంతకం చేసిన చెక్కు, ఫ్లైట్‌æ టికెట్, మొబైల్‌ ఫోన్లు లభించినట్లు తెలుస్తోంది. గ్రామస్తులందరూ చూస్తుండగానే టాటా ఇండికా విస్టా కారు నుంచి ఓ గన్నీ సంచిని ఏ–4 నిందితుడు అక్బర్‌ఖాన్‌ తీసినట్లు తెలు స్తోంది.



ఈ సంచిలో ఏముందనే ప్రశ్న వారం రోజు లుగా అంతు చిక్కకుండా ఉంది. తాజాగా విశ్వసనీ య వర్గాల సమాచారం ప్రకారం ఈ గన్నీ సంచిలో పులిచర్మం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయ జంతువైన పెద్దపులిని చంపడం, చర్మాన్ని, శరీరభాగాలతో వ్యాపారం చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. అందువల్లే కేసును పక్కకు పెట్టినట్లు సందేహాలున్నాయి.



మంథని కోర్టుకు ముగ్గురు వేటగాళ్లు

మహదేవపూర్‌(మంథని): దుప్పులవేట కేసులో కరీంనగర్‌ జైలులో ఉన్న ముగ్గురు వేటగాళ్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకొని గురువారం మంథని కోర్టులో హాజరుపరిచారు. అక్బర్‌ ఖాన్‌ పరారీలో ఉండగా పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ వాసి షికారు సత్యం, మహదేవపూర్‌వాసి  అస్రార్‌ ఖురేషీ, ఖరీముల్లాఖాన్‌లను పోలీసులు మార్చి 24న అరెస్టు చేసి కోర్టులో హాజ రుపర్చగా 13 రోజుల రిమాండ్‌ విధించిన విషయం విదితమే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top