బాల్ అనుకుని బాంబుతో ఆడుతూ..

బాల్ అనుకుని బాంబుతో ఆడుతూ..


కోల్కతా: గుండ్రంగా ఉందికదా బంతేనేమో అనుకుని బాంబుతో ఆటలాడిన నాలుగేళ్ల బాలుడు.. అది పేలడంతో తీవ్రగాయాలపాలై  దుర్మరణం చెందాడు. విషాదం రేపిన ఈ ఘటన ఉత్తర కోల్కతాలోని తాళా పార్క్ ప్రాంతంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.



ఇంటిదగ్గర ఆడుకుంటున్న భుట్టో అనే నాలుగేళ్ల బాలుడికి కొద్దిగా దూరంలో ఓ గుండ్రటి ఆకారం కనబడింది. అది బంతేనని భావిచిన బాలుడు.. దాన్ని చేతుల్లోకి తసుకుని కిందికీ, పైకి విసురుతూ ఆడుకునే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.



పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన బాంబ్ డిస్పోజల్ బలగాలు తాళా పార్క్ సమీపంలోనే మరో రెండు నాటు బాంబులను వెలికితీశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top