యాకూబ్ మెమన్ కేసులో ఎప్పుడేం జరిగిందంటే..

యాకూబ్ మెమన్ కేసులో ఎప్పుడేం జరిగిందంటే..


1993 మార్చి 12: ముంబైలో 13 ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లు.. 257 మంది మృతి.. 713మందికి పైగా గాయాలు

1993 నవంబర్ 4: 189 మంది నిందితులపై దాదాపు 10వేల పేజీల చార్జిషీటు దాఖలు

1995 ఏప్రిల్ 10: 26మంది నిందితులను విడుదల చేసిన టాడా కోర్టు



2001 జూలై18: 684మంది సాక్షుల స్టేట్‌మెంట్ల రికార్డు పూర్తి

2003 సెప్టెంబర్: పూర్తయిన విచారణ.. రిజర్వులో తీర్పు

2006 సెప్టెంబర్ 12: తీర్పు వెల్లడి. యాకూబ్ మెమన్‌తో సహా అతని నలుగురు కుటుంబ సభ్యులు దోషులుగా ఖరారు. యాకూబ్ సహా 12 మంది నిందితులకు మరణ శిక్ష. మరో 20మందికి జీవిత ఖైదు.



2013 మార్చి 21:యాకూబ్ ఉరిశిక్షను సుప్రీం కోర్టు కూడా సమర్థించింది.

2014 మే: యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు.

2014 జూన్ 2: సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్‌ను వేసిన యాకూబ్

2014 డిసెంబర్: యాకుబ్ మెమన్‌కు టాడా కోర్టు విధించిన మరణశిక్షపై సుప్రీంకోర్టు స్టే



2015 ఏప్రిల్: యాకుబ్ మెమన్‌ రివ్యూ పిటిషన్‌ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

2015 జూలై 15: మరణ శిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ యాకూబ్ మెమన్ పిటిషన్

2015 జూలై 21: యాకుబ్ మెమన్‌ క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత

2015 జూలై 25: మరణ శిక్ష అమలుపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన మెమన్

2015 జూలై 28: మెమన్ పిటిషన్ పై నిర్ణయం త్రిసభ్య ధర్మాసనానికి అప్పగింత

2015 జూలై 29: యాకుబ్ మెమన్‌ క్యూరేటివ్ పిటిషన్ తిరస్కరణ, ఉరిశిక్ష అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం నిరాకరణ

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top