ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై దారుణం
షాజానన్పూర్: ఉత్తరప్రదేశ్లో షాజానన్పూర్ సమీపంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 16 ఏళ్ల అమ్మాయిపై ఓ దుండగుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో విమ్లేష్ కుష్వాహా అనే వ్యక్తి బాధితురాలి ఇంట్లోకి చొరబడి దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు.