అమ్మకు 12... నాన్నకు 13 ఏళ్లు

అమ్మకు 12... నాన్నకు 13 ఏళ్లు


బ్రిటన్ లో ఓ జంట చిన్నారికి జన్మనిచ్చింది. అయితే అందులో విశేషం ఏముందనుకుంటున్నారు. విశేషం ఉంది. జన్మనిచ్చిన తల్లి వయస్సు 12 ఏళ్లు, తండ్రి వయస్సు 13 ఏళ్లు. ఇది నిజమేనా అని అశ్చర్యపోతున్నారా? నిజమండి నమ్మాలి మీరు...  లండన్లోని ఉత్తర ప్రాంతంలో గత వారం చివరిలో ప్రాధమిక పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఓ చిన్నారికి జన్మనిచ్చారని ద మిర్రర్ గురువారం వెల్లడించింది. ఆ నవజాత శిశువుతోపాటు తల్లిదండ్రులు సంపూర్ణ ఆర్యోగంగా ఉన్నారని తెలిపింది.


 


అంతేకాకుండా ఆ శిశువు ఫోటోను ఆన్లైన్ పత్రికలో పెట్టింది. కాగా సదరు తల్లితండ్రుల పేర్లు మాత్రం వెల్లడించేందుకు నిరాకరించింది. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమైయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి పేర్లు వెల్లడించడం లేదని తెలిపింది. ఆ తల్లిదండ్రులు ఇద్దరు చిన్న వయస్సు వారు కావడంతో వారికి శిశువును చూసుకోవడంలో పలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో నవజాత శిశువుతో పాటు బాలబాలికను వారి తల్లితండ్రుల సహకారం అందించాలని అభిప్రాయపడ్డింది.  గతంలో లండన్ నగరంలో ఓ చిన్నారికి జన్మనిచ్చిన బాలిక కంటే... ప్రస్తుతం జన్మనిచ్చిన బాలిక అయిదు నెలల చిన్నదని పేర్కొంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top