'అలా అంటే..ఓటుకు కోట్లు కేసు సమసిపోయినట్లు కాదు'

'అలా అంటే..ఓటుకు కోట్లు కేసు సమసిపోయినట్లు కాదు' - Sakshi


హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో మెలగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంటే ఓటుకు కోట్లు కేసు సమసిపోయినట్లు కాదని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు, ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు అన్న రీతిలో రాష్ట్రపతి ప్రసంగించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో శనివారం కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య సెక్షన్-8 అంశాన్ని ముడిపెట్టే విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికారు.



చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలను గౌరవించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని ఆయన తెలిపారు.  కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలసి మెలసి ఉండాలని,  రెండు రాష్ట్రాలు సామరస్య వాతావరణంలో పనిచేయాలని, దేశభ్యున్నతికి పాటుపడాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆకాంక్షించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top