కార్యకర్తలారా...ధైర్యంగా పోరాడండి


సాక్షి ప్రతినిధి, కరీంనగర్ /మంకమ్మతోట : అనేక హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యూరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ఏదో అద్భుతం చేస్తుందని చెబుతూ ఆచరణ సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల పక్షాన పోరాటాలకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి దేవుడై కొలువున్నంత కాలం వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. కాబట్టి కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని, ప్రజల పక్షాన పోరాడాలని, పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితోపాటు తామూ అండగా ఉంటామని అన్నారు. కరీంనగర్‌లోని కళాభారతిలో ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.

 

  జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి  అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పొంగులేటితోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శివకుమార్, నల్లా సూర్యప్రకాష్, గాదె నిరంజన్, మతిన్, గున్నం నాగిరెడ్డి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భీష్మ రవీందర్, రాష్ట్ర నాయకులు బోయినపల్లి శ్రీనివాస్, అక్కెనపెల్లి కుమార్, ముస్తాక్, డాక్టర్ నగేష్, సెగ్గం రాజేష్, సందమళ్ల నరేష్, జగతి, సంతోష్‌రెడ్డి, ముల్కల గోవర్దన్, మందా రాజేష్‌కుమార్, ఎండీ.వాజీద్ తదితరులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

 

  తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది రైతులకు సంతాపంగా 2నిమిషాలపాటు మౌనం పాటించారు. పలు తీర్మానాలు చేశారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ..  వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక కరీంనగర్ జిల్లాలోనూ 30 మంది చనిపోయారన్నారు. వారి కుటుంబాలను పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్చాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయూరని అన్నారు. త్వరలోనే కరీంనగర్‌లోనూ వైఎస్.షర్మిల పర్యటించి ఆయా కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు.

 

 - రాష్ట్రంలో ఎన్ని పార్టీలొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఢోకా లేదని, 2019 ఎన్నికల్లో అధికారం వైఎస్సార్ కాంగ్రెస్‌కే దక్కుతుందని పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రుల పాలన రావణకాష్టంలా మారిందని పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న పార్టీ తమదేనని, రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు.

 

 ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పాలిట భష్మాసుర హస్తంగా మారారని విమర్శించారు. టీఆర్‌ఎస్ భవిష్యత్తు అంధకారమవుతున్న సమయంలో రాజకీయ భిక్ష పెట్టిన కరీంనగర్ జిల్లాను సీఎం అయ్యాక కేసీఆర్ మరిచారని మండిపడ్డారు. హెలికాప్టర్‌లో తిరుగుతున్న కేసీఆర్‌కు పంటలు నష్టపోయి కన్నీరుపెట్టుకున్న జిల్లా రైతులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ కల అరుున ఎల్లంపల్లి ప్రాజెక్టును వెంటనే ప్రారంభించి రైతులకు సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి పూర్తి చేయని పక్షంలో కేసీఆర్ చరిత్రహీనుడుగా మిగిలిపోతారన్నారు. దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు రాబోయే రోజుల్లో దళితులే బుద్ధి చెప్పబోతున్నారని పార్టీ జిల్లా ఇన్‌చార్జి నల్లా సూర్యప్రకాష్ అన్నారు.

 

 అందులో భాగంగా త్వరలోనే కలెక్టరేట్లను ముట్టడించబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, పేదలు, కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌ను స్థాపించారని, అధికారం కోసం కాదని గాదె నిరంజన్ వ్యాఖ్యానించారు. ప్రజాదరణ కలిగిన జగన్ సమైక్య రాష్ట్రం కొనసాగితే ముఖ్యమంత్రి అవుతారనే భయంతోనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు.

 

 పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆశయ సాధనకోసం ఆవిర్భవించిన పార్టీని ప్రజల మద్దతుతో ముందుకు తీసుకుపోతామన్నారు. సమావేశంలో చేసిన తీర్మానాలపై ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం దారుణమన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు.

 

 రాష్ట్ర కార్యదర్శి బోయిన్‌పెల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ గడ్డపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఘనంగా స్వాగతించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారి నిర్వహించిన ఈ సమావేశానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను తలపిస్తున్నారని అన్నారు.

 

 రాష్ట్ర కార్యదర్శి అక్కెనపెల్లి కుమార్ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనతికాలంలోనే అతి పెద్ద పార్టీగా రూపుదిద్దుకుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఆరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజాసంక్షేమం మరిచారని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేసేదాకా ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తామన్నారు.

 

 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ కె.నగేష్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ గాలి ఉప్పెనలా వీస్తున్న సమయంలో ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గెలిచి వైఎస్సాసీపీ సత్తా చాటారన్నారు. అకాల వ ర్షాలతో జిల్లాలో 50వేల ఎకరాల్లో పంటలు నష్టపో యి రైతులు కంటతడి పెడుతుంటే కేసీఆర్  స్పం దించకపోవడం శోచనీయమన్నారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్‌ను కరువు జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో 50 వేల మందితో పార్టీ అధినేత వైఎస్.జగహన్‌రెడ్డితో సభ నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షుడిని కోరారు.

 

 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సెగ్గెం రాజేష్ మాట్లాడుతూ అమరుల త్యాగంతో వచ్చిన తెలంగాణలో సీఎం అయిన కేసీఆర్ ప్రజల సంక్షేమాన్ని మరిచారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో పోరాటాలు నిర్వహించి సర్కారుకు బుద్ధి చెబుతామని అన్నారు.

 

 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మథిన్, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముస్తఫా మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో వైఎస్సార్  పేదల గుండెల్లో నిలిచారని గుర్తుచేశారు. మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్, 108, 104 సేవలు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేలాది కుటుంబాల్లో సంతోషాన్ని నిలిపారన్నారు.

 

 ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి, జిల్లా సహాయ ఇన్‌చార్జి పరిశీలకుడు గూడూరు జైపాల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు సొల్లు అజయ్‌వర్మ, ముస్కు వెంకటరెడ్డి, జక్కుల యాదగిరి, ఎల్లంకి రమేష్, ఎద్దు లక్ష్మీనారాయణ, వడ్లకొండ గంగారాం, మల్యాల ప్రతాప్, గుంటిపెల్లి అజయ్, ఎంఏ.ముస్తాక్, జిల్లా అధికార ప్రతినిధులు వరాల శ్రీనివాస్, గండి శ్యాం, నగర అధ్యక్షుడు సిరి రవి, జిల్లా కార్యదర్శులు గాలి ప్రశాంత్‌బాబు, మోకెనపెల్లి రాజమ్మ, బోగె పద్మ, కాచారపు కిరణ్, గండి గణేష్, భూసారపు రవీందర్‌గౌడ్, ఎడవెల్లి కిషన్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కట్ట శివ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దేవరనేని వేణుమాధవరావు, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.సలీం, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు పిండి మల్లారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సండ్రు విజయ్‌కుమార్, క్రిష్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు శరత్‌కుమార్, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రావు, టీచర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు వేముల సుదర్శన్‌రెడ్డి, పబ్లిసిటీ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, పార్టీ జిల్లా కోశాధికారి పెద్దిరెడ్డి అవినాష్‌రెడ్డి, సాంస్కృత విభాగం ప్రధాన కార్యద ర్శులు సందమల్ల నరేష్, జగతి, మైనారిటీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎండీ.వాజిద్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్, మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.హైదర్ అలీ, నాయకులు రహమాన్, ఎండీ.సర్దార్, బండారి రాజు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top