వైఎస్ ఆశయాలను మనమే బతికించాలి

వైఎస్ ఆశయాలను మనమే బతికించాలి - Sakshi


అందరూ చేయీ చేయీ కలిపి రాజన్న రాజ్యం తెచ్చుకోవాలి: షర్మిల

రంగారెడ్డి జిల్లాలో మూడోరోజు కొనసాగిన పరామర్శ యాత్ర


 

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘నేటికీ కోట్ల మంది తెలుగు ప్రజల కళ్లల్లో తడి ఆరలేదు. ఈరోజు వర కూ తెలుగు ప్రజల గుండెల్లో ైవె ఎస్ రాజశేఖరరెడ్డి బతికే ఉన్నారు. ఆయనకు మరణం లేదు. తెలుగు జాతి ఉన్నంత కాలం ప్రజల హృదయాల్లో రాజన్నగా బతికే ఉం టారు. ఆయన ఆశయాలను మనమే బతి కించాలి. మీరూ, మేం చేయీ చేయీ కలపాలి రాజన్న రాజ్యం తెచ్చుకోవాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు.



రంగారెడ్డి జిల్లాలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించినవారి కుటుంబాలను పరామర్శిస్తున్న షర్మిల బుధవారం మూడోరోజు చేవెళ్ల, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో నాలుగు కుటుం బాలను కలుసుకున్నారు. వారి కష్టసుఖాలను తెలుసుకుని ధైర్యం చెప్పారు. తాండూరులోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.



 వైఎస్ ప్రజల మనిషి కాబట్టే..

 వైఎస్ ప్రజల మనిషి కాబట్టే జనం గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారని షర్మిల అన్నారు. ‘దేశ చరిత్రలో ఎప్పుడూ జరగనిది వైఎస్ విషయంలో జరిగింది. ఒక్క నాయకుడు చనిపోతే ఆ బాధను భరించలేక జీర్ణించుకోలేక వందల మంది ఆయన వెనకాలే వెళ్లిపోయారు. ఇది సామాన్యమైన విషయం కాదు. వైఎస్ ప్రజల గుండెల్లో బాధను తన బాధగా భావించారు. అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజల పక్షాన నిలిచారు. సీఎం అయిన క్షణం నుంచి ప్రజల గురించే ఆలోచించి అద్భుత పథకాలకు రూపకల్పన చేశారు.



పేదలను తన భుజాన మోశారు. రైతును రాజును చేశారు. అందుకే రాజశేఖరరెడ్డి రాజన్న అయ్యారు. కోట్ల మందికి ఆత్మబంధువయ్యారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులకు మేలు చేశారు. సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్క రంగానికి మేలు చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరో పేదలు ఉచితంగా చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. పేదలు జబ్బు పడితే ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. 108 సర్వీసులతో లక్షలాది మందికి పునర్జన్మనిచ్చారు’ అని షర్మిల అన్నారు.



 ఆప్యాయత.. ఆత్మీయత మధ్య..

 వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించిన షర్మిలకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. తొలుత మొయినాబాద్ మండలం ఎన్కేపల్లిలో ఈడిగి సుగుణమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ‘చిన్నప్పుడే మమ్మల్ని వదిలి నాన్న వెళ్లిపోతే.. అమ్మే అన్నీ తానై మమ్మల్ని సాకింది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక అమ్మ కూడా చనిపోయింది’ అని కుటుంబసభ్యులు బోరున విలపించారు  పేద విద్యార్థులకు ఉచిత విద్యను ప్రారంభించిన తమ తల్లి స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని సుగుణమ్మ కుటుంబీకులు చెప్పారు. అనంతరం పరిగి నియోజకవర్గంలోని కల్ప కృష్ణారెడ్డి కుటుం బాన్ని షర్మిల పరామర్శించారు.



తర్వాత పరిగి మండల కేంద్రంలో బంగరిగళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. పెద్దదిక్కు పోవడంతో వీధినపడ్డ శ్రీనివాస్ భార్య అనసూయకు అంగన్‌వాడీ కార్యకర్త పోస్టు ఇప్పించేందుకు చొరవ చూపుతానని భరోసా ఇచ్చారు. తర్వాత బషీరాబాద్ మండలం గొట్టిగఖుర్దులో అవుసల లక్ష్మయ్యచారి కుటుం బాన్ని షర్మిల పరామర్శించారు. ‘మీ కుటుం బాన్ని ఆదుకునే బాధ్యత మాదే’ అంటూ వారికి భరోసా ఇచ్చారు.



షర్మిల వెంట పరామర్శ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, జిల్లా అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాష్, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు బీష్వ రవీందర్, ప్రఫుల్లారెడ్డి, జార్జ్ హెర్బెర్ట్, నర్రా భిక్షపతి, శ్రీనివాస్‌రెడ్డి, ముజతబా అహ్మద్, వెంకట్రావ్, కార్యదర్శులు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, రఘురామ్‌రెడ్డి, రామ్‌భూపాల్‌రెడ్డి, ప్రభుకుమార్, అమృతాసాగర్, వరలక్ష్మి, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు సూర్యనారాయణరెడ్డి, గోపాల్‌రావు, వనజ, సత్యమూర్తి, విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మేరీ, వీఎల్‌ఎన్ రెడ్డి, బంగి లక్ష్మణ్, జి. జైపాల్‌రెడ్డి, జస్వంత్‌రెడ్డి, సుమన్‌గౌడ్, విలియం మునగాల, మల్లు రవీందర్‌రెడ్డి, సంజీవరావు, జగదీశ్వర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top