బెట్టింగ్‌లకు బ్రేక్ పడేనా?


 ఇండియున్ ప్రీమియుర్ లీగ్ (ఐపీఎల్)-7 వ్యూచ్‌లు బుధవారం నుంచి ప్రారంభం కానుండడంతో బెట్టింగ్ రాయుళ్లకు మళ్లీ చేతికి పని దొరికినట్లు అయ్యింది. టీ - 20 అనంతరం పొట్టి ఫార్మెట్‌లో ఐపీఎల్ జరుగుతుండడంతో ఆయా జట్లపై యువత పందేలు కాసేందుకు సిద్ధమవుతోంది. మ్యాచ్‌ల ప్రారంభ సవుయూనికి కొన్ని గంటల ముందు ఫోన్ల ద్వారా బెట్టింగ్‌లకు తెరతీయనున్నారు.



 వుుఖ్యంగా పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్, కొత్తబస్టాండ్, శివాజీనగర్, శ్రీనగర్ కాలనీ, సుభాష్ రోడ్డు, భారత్‌నగర్, గాంధీ చౌక్, బారాఇమాం, పాత పోస్టాఫీస్, ముస్తాబాద్, నర్సాపూర్ చౌరస్తాల వద్ద ఈ బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సవూచారం. గత టీ - 20 మ్యాచ్‌లకు సంబంధించి ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్లు, రన్స్, ఒక ఓవర్‌లో ఫోర్లు, సిక్స్‌లతో పాటు చివరి బాల్‌కు చేసే రన్స్‌పై, సూపర్ ఓవర్‌పై ఫోన్‌ల ద్వారా బెట్టింగ్‌లు జరిగిన ట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో రూ.100కు-రూ.1000, రూ.1000కి-రూ.10 వేలు, రూ.10 వేలకు - రూ.లక్ష వరకు చెల్లిస్తుండటంతో పలువురు యువకులు తవు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ ఊబిలోకి దిగుతున్నారు.



 వీరి నుంచి డబ్బును సేకరించడానికి పట్టణంలో చిరువ్యాపారాలను బెట్టింగ్ రాయుళ్లు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి బెట్టింగ్‌లో నష్టపోయి ఇంటిని విక్రయించినట్లు సమాచారం. పట్టణానికి చెందిన ఓ పండ్ల వ్యాపారి బెట్టింగ్‌లపై రూ. రెండు లక్షలకు పైగా నష్టపోరుు సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్లాడు. గతేడాది రూ. 20 వేలుకు బెట్టింగ్ కాసి మ్యాచ్ ఓడిపోవడంతో తన యమహా బైక్ (ఎఫ్‌జెడ్)ను అక్కడే వదిలివెళ్లిన ట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లో నష్టపోరుున పలువురు అందిన చోటల్లా అప్పులు తీర్చి వాటిని తీర్చలేక అజ్ఞాతంలోకి వెళ్లిన సందర్భాలు లేకపోలేదు.



ఈ విషయాన్ని బయటకు  చెప్పుకోలేక సతవుతం అవుతున్నారు. గతేడాది ఐపీఎల్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. తరువాత దీనిపై పెద్దగా దృష్టి సారించక పోవడంతో వీరు మళ్లీ పెట్రేగినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఎన్నికలపై దృష్టిని కేంద్రీకరించడంతో బెట్టింగ్‌లు ఊపందుకునే ప్రమాదం లేకపోలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఐపీఎల్ ఫీవర్ వుుసుగులో సాగుతున్న బెట్టింగ్ దందాను అడ్డుకోవడానికి పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top