మహాశివరాత్రి పుణ్యస్నానాలకు వెళ్లి...


వేర్వేరు చోట్ల 8 మంది మృతి



పినపాక/హాజీపూర్‌: మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు వేర్వేరు జిల్లాల్లో గోదావరిలో దిగిన 8 మంది యువకులు మృత్యువాతపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం చింతల బయ్యారం వద్ద నలుగురు, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం ముల్కల్ల వద్ద మరో నలుగురు చనిపోయారు. అధికారులు హెచ్చరికలు చేకుండా నదిలోకి నీటిని వదలడం వల్ల నలుగురు చనిపోయి నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యా రానికి చెందిన తంతరపల్లి మురళీ కృష్ణ(20), అల్లి నాగేంద్ర బాబు(20), ఉప్పాక గ్రామానికి చెందిన బోనగిరి పవన్‌కుమార్‌(20) భద్రా చలంలో ఐటీఐ చదువుతున్నారు.



ఏడూళ్ల బయ్యారానికి చెందిన జి.ప్రేమ్‌ కుమార్‌ (22) ఆర్థిక ఇబ్బందులతో డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు. ప్రాణస్నేహితులైన వీరు మహా శివరాత్రి సందర్భంగా చింతలబయ్యారం వద్దనున్న గోదావరి నదిలో పుణ్యస్నానానికి వెళ్లారు. నదిలో దిగి వీరు స్నానం చేస్తుం డగా.. పవన్‌కుమార్‌ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి దిగబడ్డాడు. అతడిని రక్షించే ప్రయత్నంలో ముగ్గురు వెళ్లగా సుడి గుండంలో మునిగిపోయారు. అక్కడే ఉన్న ఈతగాళ్లు.. స్థానికులు నాటుపడవ సహా యంతో వెతికి నలుగురి మృతదేహాలను వెలికి తీశారు.



మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం ముల్కల్ల గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తుండగా.. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఏడుగురు యువకులు కొట్టుకుని పోసాగారు. గట్టుపై ఉన్న భక్తులు చీరలు వేసి ముగ్గురిని కాపా డారు. మంచిర్యాల జాఫర్‌నగర్‌కు చెందిన పాన గంటి శ్రీకాంత్‌(27), పోతుల సుధాకర్‌(32), మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన ఆనందం సాయి తేజ(20), చెట్ల చంద్రమౌళి(27) గల్లంత య్యారు. పోలీసులు గజ ఈతగాళ్లతో వెతి కించగా శ్రీకాంత్‌ మృతదేహం లభించింది.  నీటి విడుదలపై ఆర్డీవోకు సమాచారమి చ్చామని అధికారులు చెబుతున్నారు.  



ఈత సరదా.. ఇద్దరి బలి

ప్రమాదవశాత్తు శామీర్‌పేట్‌ పెద్దచెరువులో మునిగి విద్యార్థుల మృతి

హైదరాబాద్‌: ఈత సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను బలికొంది. హైదరాబాద్‌ కాప్రా పరిధిలోని చర్లపల్లికి చెందిన ప్రజ్ఞాపురం సాయిరాం(17), సికింద్రాబాద్‌లోని సీఎం ఆర్‌ కాంప్లెక్స్‌ ప్రాంతానికి చెందిన మాడిశెట్టి విష్ణువర్థన్‌(18)æస్నేహితులు. వీరు మెదక్‌ జిల్లా శివంపేట్‌ మండలం గోమారంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా సెకండియర్‌ చదువుతున్నారు. ఈ నెల 23న సాయంత్రం సాయిరాం, విష్ణువర్థన్, మరో 11 మంది స్నేహితులు శామీర్‌పేట్‌ మండలం పెద్దచెరువులోకి ఈత కొట్టేందుకు దిగారు. అయితే వీరు దిగిన ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటంతో విష్ణువర్థన్, సాయిరాం ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయారు. వారి కోసం స్నేహితులు కొద్దిసేపు వెతికారు. అనంతరం పోలీసులకు, తల్లిదండ్రులకు సమా చారం అందించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గజఈతగాళ్లతో వెతికించినా  దొరకలేదు. చివరకు శుక్రవారం ఉదయం ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు.  కుమారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top