‘ఎల్లంపల్లి’ ఎత్తిపాయె!

‘ఎల్లంపల్లి’ ఎత్తిపాయె! - Sakshi


ప్రాజెక్టు రిపోర్టు

జలాశయం పూర్తయినా నెరవేరని లక్ష్యం

సాగునీటికి ఎదురుచూస్తున్న 17 మండలాలు


లక్ష్యానికి దూరంగా లక్ష ఎకరాలకు సాగునీరు

 పావలా వంతు ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి లేదు

4,364 ఎకరాల భూసేకరణే అసలు సమస్య..

ప్రధాన కాల్వలు, ఉప కాల్వల పనులకు బ్రేక్‌




ఈ లక్ష్యం ఎప్పటికి నెరవేరేను?

1,65,700 ఎకరాలు

ఎల్లంపల్లి కింద ఉమ్మడి కరీంనగర్‌లోని చొప్పదండి, వేముల వాడ, కరీంనగర్, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, నియోజక వర్గాల్లోని 1,65,700 ఎకరాలకు నీరివ్వాలనేది లక్ష్యం.



ఈ ఏడాదీ నీరందేది కష్టమే!

17మండలాలు, 171 గ్రామాలు

ఈ ప్రాజెక్టు నీటి కోసం తీవ్ర వర్షాభావ ప్రాంతాలుగా గుర్తిం చిన 17 మండలాల పరిధిలోని 171 గ్రామాల ప్రజలు ఎదు రుచూస్తున్నారు. ఈ ఏడాది కూడా నీరందించే పరిస్థితి లేదు.



భూ సేకరణ.. ఇంకా పూర్తి కాలేదు..

24,591 ఎకరాలు

రిజర్వాయర్‌ సాగు నీటికి కావాల్సిన నిర్మాణానికి 24,591 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 20,227 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఇంకా 4,364 ఎకరాలకుపైగా సేకరించాలి.



మొదట దశ లక్ష్యం మాత్రం పూర్తి..!

24,980

ప్రస్తుతం మంథని నియోజకవర్గంలో 24,980 ఆయకట్టుకు నీరందుతోంది. మంథని మంచినీటి పథకానికి 2 టీఎంసీలు, ఎన్‌టీపీసీకి 6.50 టీఎంసీల నీటిని దీని ద్వారా ఇస్తున్నారు.



ప్రతిపాదిత ఆయకట్టు 1,65,700 ఎకరాలకు నీరందించాలంటే ఇంకా 4,364 ఎకరాలు భూసేకరణ చేపట్టా ల్సి ఉంది. ఇందులో పైపులైన్లు, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాలువల నిర్మాణం చేపట్టాలి. ఇందులో ఎక్కువ శాతం పూర్తి వర్షాభావ మండలాలైన వేముల వాడ, చందుర్తి, కోనరావుపేటలోనే ఎక్కువ భూమి సేకరించాల్సి ఉంది.



ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ధరలకు, మార్కెట్‌ ధరలకు మధ్య వ్యత్యాసంతో పలు ప్రాంతాల్లో రైతుల తమ భూములను ఇచ్చేం దుకు విముఖత చూపుతున్నారు. దీంతో భూసేకరణ చివరి నిమి షంలో కత్తిమీద సాములా మారగా, సత్వరమే ప్రధాన, ఉప కాల్వలను పూర్తి చేసి నీరందించాలనిరైతులు కోరుతున్నారు. పంపుహౌస్‌ లు, ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూట రీలో, మైనర్‌ కాలువల నిర్మాణానికి భూ సేకరణ సమస్యగా తయారైంది.



మొదటి దశలో..

24,980 ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడం తోపాటు మంథని మంచినీటి పథకానికి రెండు టీఎంసీలు, ఎన్‌టీపీసీకి 6.50 టీఎంసీల నీటిని సరఫరా చేస్తున్నారు.



రెండో దశలో..

రెండో దశపైనే రైతులు ఆశలు పెట్టుకు న్నారు. సజావుగా భూ సేకరణ పూర్తయి ఉంటే ఇప్పటికే నీరందించే పరిస్థితి ఉం డేది. పరిహారం విషయంలో ప్రభుత్వం మెట్టుదిగకుంటే రెండో దశ కష్టమే.



ఈ నిర్మాణాలు పూర్తి..

ఇప్పటివరకు20,227 ఎకరాలు సేకరించారు. ఇందులో మెయిన్‌ రిజర్వాయ ర్‌తోపాటు సేకరణ పూర్తయిన ప్రాంతాల్లో పంపుహౌస్‌లు, పైపు లైన్లు, కాలువలు నిర్మించారు. ఎల్లంపల్లి జలశయాలు, పంపుహౌస్‌లు, కాలువల వ్యవస్థను ప్రధాన ప్యాకేజీ, ప్యాకేజీ1, 2, 3లుగా విభజించారు. ఇందులో ప్రధాన ప్యాకేజీ అంటే జలాశయం పరిధిలో ఉండే 15 రిజర్వాయర్‌లు, పంపుహౌస్‌లకు సంబంధించి 700 ఎకరాలు, ప్యాకేజీ –1 కింద కరీంనగర్‌ జిల్లా పరిధి గంగాధర, రామడుగు, కరీంనగర్‌ రూరల్‌–2, చొప్పదండి, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి, వేములవాడరూరల్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల,పెగడపల్లి, జగిత్యాల, మల్యాల  మండలాల పరి«ధిలో 1,059 ఎకరాలు, ప్యాకేజీ–2 కింద జగిత్యాల జిల్లా మేడిపల్లి, కథలాపూర్‌ మండలాల్లో 2,052 ఎకరాలు, ప్యాకేజీ–3 కింద రాజన్న సిరిసిల్ల చందుర్తి, రుద్రంగి వేములవాడ రూరల్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల, మల్యాల మండలాల పరిధిలో 556 ఎకరాలు సేకరించాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top