కొండకు కృష్ణాజలాలు

కొండకు కృష్ణాజలాలు


భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలైన మంచినీరు, పారిశుద్ధ్యంపై యంత్రాంగం దృష్టిపెట్టింది. మొదటినుంచి ఇక్కడ మంచినీటి సమస్య ఉంది. దీంతోపాటు కొండపైనా పారిశుద్ధ్యలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఇదే విషయమై సీఎం కేసీఆర్ కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేసీఆర్ అక్టోబర్ 17న యాదగిరిగుట్టకు వచ్చిన సమయంలో పారిశుద్ధ్యం, పందుల విహారంపై అసహనం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా  క్షేత్రం ప విత్రతను కాపాడడానికి అవసరమైన అన్ని చర్య లూ తీసుకోవాలని సీఎం అధికారులను అదేశిం చారు. ఈ క్రమంలోనే సుమారు రూ.750 కోట్లతో పలు సమస్యల పరిష్కారం, అభివృద్ధి చేసే బృహత్తర ప్రణాళిక కోసం కసరత్తు జరుగుతోంది.

 

 మంచినీటి ఎద్దడి నివారణ..

 నిత్యం వచ్చే భక్తుల అవసరాలను తీర్చడానికి యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం యాదగిరికొండపై మంచినీటి ఎద్దడిని నివారించేందుకు శాశ్వత ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం భువనగిరి నుంచి కృష్ణాజలాలు వస్తున్నప్పటికీ అవి రోజూ రావడం లేదు. వారం రోజులకోసారి వస్తుండడంతో అవి ఏమూలకూ సరిపోవడం లేదు. అయితే కృష్ణాజలాలను నేరుగా ఉదయసముద్రం నుంచి యాదగిరిగుట్టకు తీసుకురావడానికి ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ ఆదేశంతో ఆ శాఖ అధికారులు అంచనాలు కూడా ూపొందించారు. నల్లగొండ శివారులోని పానగల్లు ఉదయసముద్రం నుంచి గుట్టకు తీసుకురావాలంటే రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ ఊపులోనే నిధుల మంజూరు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో గుట్ట అధికారులున్నారు.

 

 పారిశుద్ధ్యం ఇలా..

 పారిశుద్ధ్య సమస్య దేవస్థానంతోపాటు గుట్టపరిసరాల్లో తీవ్రంగా ఉంది. ప్రధానంగా పందుల స్వైరవిహారం సాగుతోంది. పందులను దూరంగా తరిమివేయడంతోపాటు, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నిర్ణయించారు. ఇందుకోసం ముందుగా అనుకున్నట్లు గుట్ట చుట్టూ ప్రహరీ నిర్మించడానికి పెద్దఎత్తున నిధులు అవసరమవుతున్నాయి. ప్రస్తుతం దేవ స్థానం వద్ద అన్ని నిధులు లేనందున కొండచుట్టూ ట్రెంచ్‌కట్ చేయడం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ఈపని చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేర కు కలెక్టర్ చిరంజీవులు ఉపాధి హామీ పీడీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు కొండపైన పం దులకు ఆహారం దొరకకుండా చేయడానికి పారిశుద్ధ్యం మెరుగుపర్చడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇం దుకోసం అధికారుల బృందంసర్వేలు ప్రారంభించింది.

 

 

 నివేదికలు రూపొందించాం

 దేవస్థానంలో మంచి నీటి ఎద్దడి నివారణకు శాశ్వత ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రస్తుతం వస్తున్న కృష్ణాజలాలు ఏమూలకూ సరిపోవడం లేదు. శాశ్వత మంచినీటి ఎద్దడి నివార ణకు కృషి చేస్తున్నాం. అలాగే పారిశుద్ధ్యం మెరుగుదల, పందులు రాకుండా అడ్డుకోవడానికి  ఉపాధి హామీలో ట్రెంచ్‌కట్ చేయాలని ఆలోచిస్తున్నాం. దీనిపై ఉపాధి పీడీ గుట్టకు రానున్నారు.

 - గీతారెడ్డి, ఈఓ, గుట్ట దేవస్థానం

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top