హామీల అమలెక్కడ?

తేరేట్‌పల్లిలో పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ  శత జయంతి ఉత్సవాల స్టిక్కర్‌ను గోడపై అంటిస్తున్న  అమిత్‌ షా - Sakshi


రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై 30 ప్రశ్నలతో బీజేపీ అధ్యక్షుడి కరపత్రం

- ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచిన అమిత్‌ షా

- అసమర్థ పాలనకు చరమగీతం పాడాలని పిలుపు




సాక్షి, నల్లగొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తన మూడు రోజుల రాష్ట్ర పర్యట నలో అధికార టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేసే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. తొలి రోజు పర్యటనలోనే టీఆర్‌ఎస్‌ సర్కారుకు 30 ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలతో కూడిన కరపత్రాలను ఆయనే స్వయంగా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తుండడం గమనార్హం. సోమవారం నల్ల గొండ జిల్లా చండూరు మండలం తేరేట్‌పల్లిలో అమిత్‌ షా స్థానికుల ఇళ్లల్లోకి వెళ్లారు. ఐదు కుటుంబాలను కలసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి రెండు కరపత్రాలను ఇచ్చారు. అందులో మొదటిది కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించింది కాగా.. మరోటి రాష్



ట్రంలో పాలనా వైఫల్యాలను ప్రస్తావిస్తూ 30 ప్రశ్నల తో కూడిన కరపత్రం. ఈ కరపత్రం స్వయం గా ఆయనే ఇంటింటికీ వెళ్లి ఇస్తుండడం చర్చనీ యాంశమవుతోంది. దళితుడిని ముఖ్యమం త్రిని చేస్తానన్న హామీ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి పథకాల్లో అవినీతి ఆరో పణలు, ముస్లింలకు రిజర్వేషన్ల పెంపు, తెలం గాణ విమోచనదినోత్సవం, హామీల విస్మరణ, హైకోర్టు మొట్టికాయలు తదితర అంశాలను ప్రస్తావించారు. ‘హామీలు ఇచ్చారు.. అమలె క్కడ’ శీర్షికతో ముద్రించిన ఈ కరపత్రంలో.. కేసీఆర్‌ అరచేతిలో స్వర్గం చూపుతూ ప్రజలకు నరకం చూపెడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నిరంకుశ, అహంకార, అసమర్థ పాలనలో అన్ని వర్గాల ప్రజలు గోస పడుతు న్నారని, తాము ప్రస్తావించిన వైఫల్యాలు మచ్చుకు కొన్ని మాత్రమేనని పేర్కొన్నారు. ప్రజల గోస తీర్చని టీఆర్‌ఎస్‌ అసమర్థ పాల నకు చరమగీతం పాడాలని, బీజేపీ నేతృత్వం లోని తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ విధంగా టీఆర్‌ఎస్‌ను  టార్గెట్‌ చేస్తూ పార్టీ ముద్రించిన కరపత్రాన్ని అమిత్‌ షా పంపిణీ చేస్తుండటం గమనార్హం.



కరపత్రాల్లోని ప్రశ్నలివే..

► దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు మాట తప్పారు?

► మూడేళ్లలో ఎంతమంది దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారు?

► మత రిజర్వేషన్లతో బీసీలకు వెన్నుపోటు పొడవడం సమంజసమేనా?

► రైతు ఆత్మహత్యలను నివారించలేక పోవడం మీ వైఫల్యం కాదా?

► తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ఎంఐఎం ఎజెండాను అమలు చేయడం వాస్తవం కాదా?

► ఎంఐఎంకి భయపడి సెప్టెంబర్‌ 17న తెలం గాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం సమంజసమేనా?

► డబుల్‌ బెడ్‌రూం ఆశలు అడియాశలేనా?

► హైదరాబాద్‌ను ఇస్తాంబుల్, కరీంనగర్‌ను లండన్, పారిస్‌ అన్నావే.. ఏమైంది?

► హైదరాబాద్‌ సిగ్నల్‌ ఫ్రీ సిటీ, స్కైవేల హామీలు ఏమయ్యాయి? హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన జరిగిందా? మూసీ మురికి వదిలిందా?

► అవకతవకలు జరిగాయని కాగ్‌ మీ ప్రభు త్వాన్ని తలంటడం వాస్తవం కాదా?

► ఎంసెట్‌ లీకేజీ మీ వైఫల్యం కాదా?

► లక్ష ఉద్యోగాలంటూ ప్రకటనలివ్వడమే కానీ నియామకాలు జరిపారా?

► 22సార్లు హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకోవడం వాస్తవం కాదా?

► ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో అవినీతి, ఆరోపణల సంగతేంటి?

► అమరవీరుల కుటుంబాల్ని విస్మరించడం వాస్తవం కాదా?

► కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని ఎందుకు నీరుగార్చారు?

► ఆదాయం కోసం మద్యం అమ్మకాలను ప్రోత్సహించి ఎందుకు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు?

► మల్లన్నసాగర్, మిడ్‌మానేర్‌ తదితర ప్రాజెక్టుల కోసం అక్రమంగా భూములను లాక్కోవడం వాస్తవం కాదా?

► గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కేసు నీరుగార్చడం వెనుక కారణమేంటి?

► ఓయూ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిం చాల్సిన విధానం ఇదేనా? ప్రారం భోత్సవంలో మీ మౌనం దేనికి సంకేతం?

► విమర్శలను తట్టుకోలేక ధర్నా చౌక్‌ను ఎత్తేయడం ప్రజాస్వామికమేనా?

► తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచే సిన వారికి పదవులివ్వడం వాస్తవం కాదా?

► తెలంగాణ ద్రోహులతో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుంది?

► ఫిరాయింపులను ప్రోత్సహించి దొంగ దారిలో మెజార్టీ పెంచుకోవడం ప్రజాస్వా మ్య స్ఫూర్తికి తూట్లు పొడవడం కాదా?

► ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరుస మరణాలు దేనికి సంకేతం?

► సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పిస్తామని తీసుకున్న దరఖాస్తులు ఎక్కడున్నట్టు?

► మిషన్‌ భగీరథపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు విచారణ జరపడం లేదు?

► రాష్ట్రంలో నిర్మాణ పనుల్లో పర్సంటేజీలు తీసుకున్నారనేది నిజం కాదా?

► అధికారుల అవినీతితో ప్రజల అవస్థలు మీ దృష్టికి ఎందుకు రావడం లేదు?

► మీ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల కనుసన్నల్లోనే క్షేత్రస్థాయి అధికారుల నియామకం జరపడం పరిపాలనను నిర్వీర్యం చేయడం కాదా?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top