సీఎం వద్దకు కమిషనరేట్ ప్రతిపాదనలు

సీఎం వద్దకు కమిషనరేట్ ప్రతిపాదనలు


వరంగల్‌క్రైం :  వరంగల్ కమిషనరేట్ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి పంపించామని తెలంగా ణ రాష్ట్ర డీజీపీ అనుగార్‌శర్మ తెలిపారు. మొదటిసారిగా వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన డీజీపీ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. ఆయనకు వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు, వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్‌రావు, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు, పోలీస్ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం జిల్లా పోలీస్ కార్యాలయంలో రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు ఆధ్వర్యంలో నిర్మించిన పోలీస్ అమరవీరుల స్మృతివనాన్ని డీజీపీ ఆవిష్కరించారు.



ఆ తర్వాత ఎన్.మహేశ్‌కుమార్ స్మారక వ్యాయామశాలను ప్రారంభించారు. అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగం వెలకట్టలేనిదని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. ఒక ఆశయం, లక్ష్యం కోసం పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అమరవీరులకు గుర్తు గా ఏర్పాటుచేసిన ఈ స్మృతివనంలో ఒక్కో మొక్క ఒక్కో అమరవీరుడి పేరుతో ఉం దని... ఇవి పోలీస్ అమరుల కుటుంబసభ్యుల అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.



అర్బన్‌లో పోలీసుల పనితీరుపై ఆరా

డీజీపీ దంపతులు సాయంత్రం జిల్లా పోలీసు అతిథి గృహానికి  చేరుకున్నారు. సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం  నగర పరిధిలో పోలీసుల పనితీరుపై అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు వద్ద ఆరా తీశారు. ఇటీవల సంచలనం రేపిన రఘునాథపల్లి ఘటన వివరాలను అడిగారు. దొం గలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల ను నియమించాలని అర్బన్ ఎస్పీని ఆదేశిం చారు. ఆ తర్వాత డీజీపీ దంపతులు వేయిసంభాలు, భద్రకాళి, పద్మాక్షి దేవాలయాల్లో పూజలు నిర్వ హించారు.   



అక్కడినుంచి డీజీపీ దంపతు లు డీఐజీ క్యాంపు కార్యాలయానికి చేరు కున్నారు.  డీఐజీ కాంతారావు దంపతులు వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భం గా డీజీపీ గతానుభూతులను నెమరువేసుకున్నారు. అనురాగ్ శర్మ 1997 నుంచి 2000 వరకు వరంగల్ రేంజ్ డిఐజీగా పనిచేశారు. వేయిస్తంభాల ఆలయంలో డీజీపీ మీడియాతో మాట్లాడుతూ జిల్లా పోలీసుల పనితీ రుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అర్బన్, రూరల్ పోలీసు అధికారుల సంఘం నేతలు డీజీపీని కలిసి, సమస్యలపై వినతిపత్రం సమర్పించా రు. డీజీపీ వెంట అదనపు ఎస్పీలు యాదయ్య, డీఎస్పీలు హిమవతి, దక్షిణమూర్తి, రాజిరెడ్డి, సురేశ్‌కుమార్, రాజమహేంద్రనాయక్, ప్రభాకర్, ఏఆర్ ఓఎస్డీ అన్వర్ హుస్సేన్, ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top