ఏసీబీకి చిక్కిన వీఆర్వో

ఏసీబీకి చిక్కిన వీఆర్వో - Sakshi


రూ.2 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘన్‌పూర్ వీఆర్‌ఓ

 

 స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్ : పట్టా భూమికి ఆన్‌లైన్ పహణీ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ స్టేషన్‌ఘన్‌పూర్ వీఆర్‌ఓ మడిపల్లి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయూడు. మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన ప్రభుత్వాధికారుల్లో కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ ఆర్.సాయిబాబా కథనం ప్రకారం.. మండలంలోని శివునిపల్లికి చెందిన బజ్జూరి భాస్కర్‌కు స్టేషన్‌ఘన్‌పూర్‌లో సర్వే నంబర్ 682/ఏ2లో ఎకరం గుంటన్నర, 682/ఏ1లో ఎకరం గుంటన్నర భూమి ఉంది. ఆ భూములకు సంబంధించి అతడికి పాస్‌పుస్తకాలు ఉన్నారుు. 682/ఏ1 సర్వే నంబర్‌లోని అతడి భూమికి ఆన్‌లైన్ పహాణీ రాగా, 682/ఏ2లోని భూమికి ఆన్‌లైన్ పహాణీ రావడం లేదు.



ఆన్‌లైన్ పహాణీ కోసం భాస్కర్ ఘన్‌పూర్ వీఆర్‌ఓ మడిపల్లి శ్రీనివాస్‌ను ఫిబ్రవరిలో కలిసి దరఖాస్తు చేసుకున్నాడు. రెండు, మూడు రోజుల్లో ఇవ్వాల్సిన పహాణీని ఇవ్వకుండా రెండు నెలలుగా తిప్పుకుంటున్నాడు. చివరికి రూ.3వేలు లంచం ఇస్తేనే ఆన్‌లైన్ పహాణీ చేస్తానన్నాడు. ఈ మేరకు రూ.2 వేలు ఇస్తానని భాస్కర్ చెప్పడంతో మంగళవారం స్థానిక తన ప్రైవేటు ఆఫీస్‌కు రావాలని వీఆర్‌ఓ సూచించాడు. ఈ విషయమై ముందస్తుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు మంగళవారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని వీఆర్‌ఓ ప్రైవేటు కార్యాలయంలో వీఆర్‌ఓ శ్రీనివాస్‌కు రూ.2 వేలు ఇచ్చాడు. అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే వీఆర్‌ఓను అదుపులోకి తీసుకుని డబ్బులు రికవరీ చేశారు. అనంతరం వీఆర్‌ఓను, ఫిర్యాదుదారుడిని స్థానిక తహసీల్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేపట్టారు. దాడుల్లో డీఎస్పీ సారుుబాబాతోపాటు ఏసీబీ సీఐలు పి.సాంబయ్య, ఎస్‌వీ రాఘవేంద్రరావు, జి.వెంకటేశ్వర్లు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.



లంచావతారులపై ఫిర్యాదు చేయండి..



అధికారులు లంచాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడితే ఏసీబీ అధికారులను ఫిర్యాదు చే యాలని ఏసీబీ డీఎస్పీ ప్రజలకు సూచించారు. 9440446146(ఏసీబీ డీఎస్పీ-సాయిబాబా), 9440446202(సీఐ-సాంబయ్య), 9440446192(సీఐ-రాఘవేంద్రరావు), 9440446148(సీఐ-శ్రీనివాసరాజు), 9440446147(ఖమ్మం ఏసీబీ సీఐ-వెంకటేశ్వరరావు) నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. ఐదు



నెలలుగా తిరుగుతున్నా : ఫిర్యాదుదారుడు బజ్జూరి భాస్కర్



నా పట్టా భూమికి ఆన్‌లైన్ పహాణీ కోసం తహసీల్ కార్యాలయం చుట్టూ ఐదు నెలలుగా తిరుగుతున్నా. డిసెంబర్ 2014లో ఈ విషయమై తహసీల్దార్ రామ్మూర్తిని కలిసిన. ఆయన వీఆర్‌ఓ శ్రీనివాస్‌ను సంప్రదించాలని సూచిం చారు. వీఆర్‌ఓ చుట్టూ దాదాపు 30 సార్లు తిరిగిన. మొదట రూ.5 వేలు లంచం అడిగా డు. ఈ నెల 25న చివరికి రూ.3 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రూ.2 వేలు ఇస్తానని చెప్పి అదేరోజున ఏసీబీ అధికారులను కలిసిన.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top