‘మన ఊరు.. మన ప్రణాళిక’తో గ్రామాల అభివృద్ధి


కోయిల్‌కొండ: వచ్చే ఐదేళ్లలో ప్రణాళిక బద్ధంగా గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేపట్టేందుకే ‘మన ఊరు -మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లాకలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు శుక్రవారం. స్థానిక మండల కార్యాలయంలో నిర్వహించిన మన మండల-మన ప్రణాళిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి హాజరయ్యూరు.



ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  మూడు నెలలకోసారి నిర్వహించే మండల సమావేశంలో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశుధ్యం, హరితవనం, అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించాలన్నారు. రైతులు పండించే పంటలకు  కావలసిన విత్తనాలను వారే అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు అవసరమైతే  పాలెం పరిశోధన కేంద్రం నుంచి నిపుణులను పంపి సూచనలు, సలహాలు ఇప్పిస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయూలన్నారు.



 అగష్టు15లోగా లక్ష్యాన్ని పూర్తి చేసిన సర్పంచులకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో 4.50లక్షల మరుగుదొడ్లకు ప్రతిపాదనలు పంపగా ఇందులో2.25 లక్షలు మంజూరయ్యూయని, అందులో 40వేలు మాత్రమే పూర్తి కావడం జరిగిందన్నారు. నిర్మాణాలు త్వరగతిన పూర్తి చేసేందుకు సర్పంచులు  చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా డంపింగ్ యూర్డుల నిర్మాణానికి నిధులు మంజూైరె నట్లు తెలిపారు.  మహిళాసంఘాలు పాడిపరిశ్రమపై ఆసక్తి చూపాలన్నారు. కోయిల్‌సాగర్ నుంచి మండలానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గొండ్యాల వాగు ద్వారా మండలంలోని ఏడు పెద్ద చెరువులకు నీరు అందించేందుకు సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు.



 సివిల్ ఆసుపత్రికి అత్యాధునిక భవనం

 స్థానిక సివిల్ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే అత్యాధునిక భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ్ర కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డితో కలిసి  ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్బంగా  భవన నిర్మాణంపై స్థానికుల సూచనలు ,సలహాలు స్వీకరించారు. ఆసుపత్రి చుట్టూ మరికొంత స్థలాన్ని సేకరించి రెండస్థుల భవనాన్ని నిర్మిస్తామన్నారు.



అనంతరం బీసీ హాస్టల్‌ను సందర్శించి అక్కడ ఉన్న పాత పోలీస్‌స్టేషన్ తొలగించాలని అధికారులను ఆదేశించారు. రూ.43లక్షలతో నిర్మించిన మంచినీటి ట్యాంకును ప్రారంభించారు. నీటి సరఫరాకు పెద్ద వాగులో సంపు ఏర్పాటు చే యూలని గ్రామసర్పంచ్ మంజూల, మాజీ ఎం పీపీ వై.మహేందర్‌గౌడ్ కలెక్టర్‌ను కోరారు.  కా ర్యక్రమాల్లో స్పెషల్ ఆఫీసర్ జయచంద్ర, ఎం పీపీ బోయిని స్వప్నరవి, వైఎస్ ఎంపీపీ శారద, ఎంపీడిఓ భాగ్యలక్ష్మీ, తహశీల్దార్ ప్రేమ్‌రాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ డిఈ పుల్లారెడ్డి, ఏఈ సమీర్‌ఉల్లాఖాన్, క్లస్టర్ ఆఫీసర్ డాక్టర్ హరిశ్చంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top