ముగిసిన శ్రీవారి బ్రహ్సోత్సవాలు

ముగిసిన శ్రీవారి బ్రహ్సోత్సవాలు


కొడంగల్: కలియుగ వైకుంఠ దైవం.. ఆపదల మొక్కులవాడు.. అనాథ రక్షకుడు.. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీవారి బ్రహ్సోత్సవాలు బుధవారంతో ముగిశాయి. కొడంగల్‌లోని బాలాజీనగర్‌లో వెలిసిన పద్మావతి సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు 11రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగాయి.


బుధవారం ఉదయం పల్లకిసేవలో స్వామివారిని ఊరేగించారు. వరహాస్వామి ఆలయ ప్రాంగణంలో అభిషేకం, అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పుష్కరిణిలో చక్రస్నానం చేయించారు. సుందర వరద భట్టాచార్యులు, కంకణభట్టు లక్ష్మీకాంతాచార్యులు పలు కార్యక్రమాలు జరిపారు. ఉత్సవమూర్తులకు విశేషపూజలు చేశారు. అభిషేకం, దూపదీప నైవేద్యం సమర్పించారు. పవిత్రజలంతో నింపిన గుండంలో స్వామివార్లకు స్నానం చేయించారు. తిరుమల తిరుపతి నుంచి వచ్చిన సుమారు పాతిక మంది అర్చకులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.




దొంగలు ముఖాలకు ముసుగులు, మంకి టోపీలు ధరించి ఉన్నట్లు ప్రిన్సిపాల్ కుమార్తె హర్ష, కుమారుడు అభినందన్‌లు తెలిపారు. షాట్‌లు ధరించి పైన పంచతో గోచీలు పెట్టుకున్నట్లు, ఒంటికి నూనె రాసుకుని బట్టలు లేకుండా ఉన్నట్లు వివరించారు. తాము అల్లరి చేసే ప్రయత్నం చేస్తే తన 20 రోజుల కుమారుడిపై కత్తిపెట్టి బెదిరించారని హర్ష పేర్కొంది. అదే సమయంలో పోలీసులు సైరన్ ఇవ్వడంతో పారిపోయారని తెలిపింది. దీంతో తాము ఊపిరి పీల్చుకున్నామన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top