ఏసీబీ వలలో వీఆర్‌ఓ


  - రూ. 5 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

- నెల క్రితం ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్..

 డిచ్‌పల్లి :
లంచం తీసుకుంటూ ఓ వీఆర్‌ఓ ఏసీబీ కి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సంజీవరావు  తెలి పిన వివరాలిలా ఉన్నాయి. గొల్లపల్లికి చెందిన రైతు గుడాల ఒడ్డెన్న తన బావమరిదికి చెంది న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. ఒడ్డెన ్న తన పేరిట పాసు పుస్తకం, టైటిల్ డీడ్, ఆర్డర్ కాపీ కోసం వీఆర్‌ఓ భూపతిరెడ్డిని సంప్రదించాడు. వీటికోసం ఆయన రూ. 10 వేలు డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇచ్చుకోలేనంటూ ఒడ్డెన్న ప్రాధేయపడ్డాడు. దీంతో రూ. 6 వేలకు బేరం కుదిరింది. పది రోజుల క్రితం వేయి రూపాయలు ఇచ్చాడు. మిగిలిన రూ. 5 వేల కోసం భూపతిరెడ్డి వేధిస్తుండడంతో విసుగు చెందిన ఒడ్డెన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు గురువారం అమృతాపూర్‌లోని వీఆర్‌ఓ కార్యాలయంలో రూ.5వేల నగదును వీఆర్‌ఓకు అందించాడు. అక్కడే కాపుకాసిన ఏసీబీ అధికారులు దాడి చేసి వీఆర్‌ఓను పట్టుకున్నారు.

 

ఐదు వారాల వ్యవధిలో..

ఐదు వారాల వ్యవధిలోనే మండలంలో ఇద్దరు ప్రభుత్వోద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశమైంది. గత నెల 13వ తేదీన ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్ అజ్మత్ పాస్‌పోర్టు విచారణ నిమిత్తం రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఏసీబీకి వీఆర్‌ఓ చిక్కడంతో పలువురు రెవెన్యూ అధికారులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో పలువురు  ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

 

డబ్బులిస్తేనే పనిచేస్తానన్నాడు..

మా బావమరిది వద్ద రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. ఈ భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం, టైటి ల్ డీడ్, ఆర్డర్ కాపీని నా పేరుపైకి మార్చుకోవడం కోసం మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాను. రూ. 10 వేలు ఇస్తేనే పాసు పుస్తకాలు ఇస్తాను, లేదంటే ఇవ్వనని వీఆర్‌ఓ భూపతిరెడ్డి డిమాండ్ చేశాడు. డబ్బులకోసం వేధిస్తుండడంతో ఏసీబీకి పట్టించాను. నాలాగే చాలా మందిని ఆయన డబ్బులకోసం వేధించాడు.          - బాధిత రైతు ఒడ్డెన్న

 

 

పైసలివ్వకపోతే పెండింగే..

పలువురు ప్రభుత్వోద్యోగులు లంచాలకు అలవాటు పడి పైసలిస్తేనే పనులు చేస్తున్నా రన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ము ఖ్యంగా రెవెన్యూ, పోలీసు శాఖల్లో ఈ విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. పైసలిస్తేనే ప నులు అవుతున్నాయని, లేదంటే ఏదో ఒక కారణం చెబుతూ రోజుల తరబడి పెండిం గ్‌లో పెడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నా రు. కొందరు లంచాలు ఇచ్చి పనులు చే యించుకుంటున్నారు. లంచాలకు రుచిమరిగిన అధికారుల వేధింపులు భరించలేని వారు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. గురువా రం ఏసీబీ అధికారులకు పట్టుబడిన వీఆర్‌ఓ భూపతిరెడ్డి ఇదే మండలంలో కొ న్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఖిల్లా డి చ్‌పల్లి, సుద్దపల్లి, అమృతాపూర్, గొల్లపల్లి గ్రామాల వీఆర్‌ఓగా పని చేశారు.



వీఆర్‌ఓ లాంగ్ స్టాండింగ్ కావడంతో గతంలో ఆ యనను సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామానికి బదిలీ చేశారు. అయితే రాజకీ య నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆయన నాలుగు నెలల్లోనే తిరి గి డిచ్‌పల్లి మండలానికి బదిలీపై వచ్చారు. ఆయన సర్టిఫికెట్ల నుంచి పట్టాదారు పా సు పుస్తకాల వరకు అన్నింటికీ వెలకట్టి అ మ్ముకుంటున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నా రు. ఆర్ ఐ, తహశీల్దార్‌లకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఆయన డబ్బులు వసూ లు చేస్తున్నట్లు తెలుస్తోంది.



ఈ విషయమై స్థానిక అధికారులకు కొందరు బాధితులు ఫిర్యాదులు చేసినా.. ఆయనపై ఎలాంటి చ ర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. మండలంలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉ న్నాయనే విషయాలను రియల్ వ్యాపారులకు చెబుతూ కబ్జాల విషయంలో వారికి సహకరించే వాడని భూపతిరెడ్డిపై ఆరోపణలున్నాయి. మండలానికి ఏ అధికారి బదిలీపై వచ్చినా మచ్చిక చేసుకుని అన్నీ తానై పనులు చక్కబెడతాడని ఆయనకు పేరుంది. మండలంలో పని చేసే మరి కొందరు వీఆర్‌ఓలు సైతం ఏసీబీ దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top