సర్కారుబడిపై చిన్ననచూపు వద్దు!

సర్కారుబడిపై చిన్ననచూపు వద్దు!


బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి

 

కల్వకుర్తి : సర్కారుబడి పేదలకు దేవాలయం లాంటిదని, అలాంటి ఆలయంపై చిన్నచూపు తగదని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ సమీపంలోని వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అక్షర వనం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థులనుద్ధేశించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు చిన్నవని, ప్రైవేట్ పాఠశాలలు గొప్పవని కొందరు ప్రచారం చేసుకోవడం మానుకోవాలని సూచిం చారు. దేశనాయకులు, శాస్త్రవేత్తలు, ప్రముఖులందరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారేనన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, నేటి ప్రధాని మోదీలాంటి వారందరూ ఆ బడులనుంచి వచ్చిన వారేనన్నారు.



వందేమాతరం ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని, ప్రభుత్వం చేయలేని శిక్షణలు అక్షరవనంలో చేయడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. అనంతరం విద్యార్థుల ఆటలు, పాటలు, కళలు, ఇతర శిక్షణను తిలకించారు. ఆయన వెంట వందేమాతరం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఎడ్మ మాధవరెడ్డి, బీజేపీ నాయకులు దుర్గప్రసాద్, రాఘవేందర్‌గౌడ్, కృష్ణగౌడ్, రాంరెడ్డి, నర్సింహ, అజాద్ యువజన సంఘం అధ్యక్షుడు కుడుముల శేఖర్‌రెడ్డి  పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top