నేటి నుంచి భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

నేటి నుంచి భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

  • నేటి నుంచి అధ్యయనోత్సవాలు

  • ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

  • 31న తెప్పోత్సవం

  • 1న ఉత్తర ద్వార దర్శనం

  • నేటి నుంచి నిత్య కల్యాణాలు రద్దు

  • భద్రాచలం టౌన్ : భద్రాద్రి రామాలయం లో అధ్యయనోత్సవాలు నేడు ప్రారంభమవుతాయి. స్వామి వారు నేటి నుంచి ఈ నె ల 30వ తేదీ వరకు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 31న పవిత్ర గోదావరి నదిలో జరిగే తెప్పోత్సవాన్ని, జనవరి 1న ఉత్తర ద్వార దర్శనాన్ని తిలకించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు రావచ్చని దేవస్థానం అ ధికారులు అంచనా వేసి, తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.



    వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా ఉత్తర ద్వారానికి ఎ దురుగా కల్యాణ మండపం ప్రాంగణంలో సాంస్కతిక కార్యక్రమాలు, సురభి సంస్థ వారి నాటకాల నిర్వహణకు ప్రత్యేకంగా వే దిక రూపొందిస్తున్నారు. ఉత్సవాలు ము గిసేంత వరకు ఈ వేదికపై సాంస్కతిక ప్రదర్శనలు జరుగుతాయి. అంగరంగ వైభవంగా జరిగే ఈ అధ్యయనోత్సవాల కోసం భద్రాచలం పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.



    రామాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులను ఆహ్వానిస్తూ అభయాంజ నేయ స్వామి పార్క్, దమ్మక్క విగ్రహం, పంచాయతీ కార్యాలయం వద్ద, ఆలయం సమీపంలో స్వాగత ద్వారాలు ఏర్పాటవుతున్నాయి.

     

    నేటి నుంచి అధ్యయనోత్సవాలు



    వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా సోమవారం నుంచి జనవరి 11వ తేది వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. పగల్‌పత్తు ఉత్సవాలలో భాగంగా స్వామి వారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. రాపత్తు ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పల్లకిపై సేవలను స్వామి వారు రాత్రి వేళల్లో అందుకుంటారు.

     

    విలాసోత్సవాలు



    జనవరి 12 నుంచి స్వామి వారికి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో విలాసోత్సవాలు ఉంటాయి. 12న శ్రీరామదాసు మండపంలో రెవెన్యూ వారు, 13న నసింహదాస మండపంలో పంచాయతీ వారు, 14న వశిష్ట మండపంలో దేవస్థానం సిబ్బంది ఈ విలాసోత్సవాలు ఉంటాయి. జనవరి 11న కూడారై పాశుర ఉత్సవం, 14న గోదా కల్యాణం, 15న మంకర సంక్రాంతి ఉత్సవం, 17న విశ్వరూప సేవలు ఉంటాయి.  

     

    నేటి నుంచి నిత్య కల్యాణాలు రద్దు



    అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి జనవరి 1వ తేదీ వరకు స్వా మి వారికి నిత్య కల్యాణాలు ఉండవని దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి తెలిపారు.

     

     పగ ల్‌పత్తు ఉత్సవాలు

     22న మత్స్యావతారం

     23న కూర్మావతారం

     24న వ రాహావతారం

     25న నరసింహావతారం

     26న వామనావతారం

     27నపరశురామావతారం

     28న శ్రీరామావతారం

     29న బలరామావతారం

     30న శ్రీ కృష్ణావతారం

     

    రాపత్తు ఉత్సవాలు

    01న శ్రీ రామ రక్షామండపం (డీఎస్పీ కార్యాలయం)

    02న శ్రీ హరిదాసు మండపం (అంబా సత్రం)

    03న శ్రీ గోకుల మండపం (శ్రీ కష్ణ దేవాలయం)

    04న శ్రీరామ దూత మండపం (అభయాంజనేయ  స్వామి మండపం)

    05న శ్రీ గోవింద రాజ మండపం (తాత గుడి)

    06న వన విహార మండపం (వేస్ట్ ల్యాండ్)

    07న పునర్వసు మండపం

    08న విశ్రాంత మండపం (దొంగలదోపు ఉత్సవం)

    కల్కి అవతారం (శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద)

    09న వన విహార మండపం (వేస్ట్ ల్యాండ్)

    10న నమ్మాళ్వార్ల పరమపదోత్సవం (ఆలయంలో)

    11న అధ్యయనోత్సవాల సమాప్తి (దసరా మండపం)

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top