ఉత్తిపోతలే...!

ఉత్తిపోతలే...! - Sakshi


నిర్వహణ లోపంతో వట్టిపోయిన లిఫ్ట్‌లు

 

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్:

 సన్న, చిన్నకారు రైతుల అభివృద్ధి లక్ష్యంగా బలహీనవర్గాలు, షెడ్యూల్డు కులాలు, తెగలకు లబ్ధి చేకూర్చేందుకు నీటి పారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. సమష్టి వ్యవసాయ పథకం కింద ఎగువ  తట్టు, కరువు పీడిత ప్రాంతాల కు సాగునీరందించడం ఈ ఎత్తిపోతల పథకాల ఉద్దేశం. ఐడీసీ పర్యవేక్షణ లో పం, రైతు సొసైటీల్లో రాజకీయాలు, నిధుల లేమి, విద్యుత్‌కోతలు లిఫ్టుల నిర్వహణకు అడ్డంకిగా తయారయ్యా యి. దీంతో మహబూబ్‌నగర్ లాంటి క రువుపీడిత ప్రాంతాలకు సాగునీరందించాల్సిన లిఫ్టులు మూతపడ్డాయి. ఐడీసీ లెక్కల ప్రకారం  జిల్లాలో 1980 నుంచి ఇప్పటివరకు రూ.164.64 కోట్లతో 45 ఎత్తిపోతలు నిర్మించారు. 82,267 ఎకరాల ఆయకట్టుకు లిఫ్టులు సాగునీరందించేలా ప్రణాళిక రూపొందిం చారు. 10వేల ఎకరాల లోపు ఆయకట్టున్న లిఫ్టుల నిర్వహణ ఆరంభంలో ఐడీసీ స్వయంగా నిర్వహించేది. అయితే లిఫ్టుల నిర్వహణ తలకుమించిన భారం కావడంతో 1995లో ఆయకట్టు రైతులతో కూడిన సొసైటీలకు అప్పగించా రు. సొసైటీ నిర్వహణలో రాజకీయాలకు తోడవడం తో చాలాచోట్ల లిఫ్టులు మూతపడ్డాయి. ఏళ్లతరబడి సొసైటీల ఎన్నికలు జరగకపోవడంతో పంపుసెట్ల మరమ్మతులు, కాల్వల్లో పూడికతీత వంటి పనులు మూలనపడ్డాయి. లి ఫ్టుల నిర్వహణకు డెడికేటెడ్ పవర్ లై న్సు (ప్రత్యేక విద్యుత్ సరఫరా లైన్లు) ఏర్పాటు చేసి రోజుకు కనీసం 16 గంటలు నిరంతర విద్యు త్ సరఫరా చే యాల్సి ఉంది. ఎల్‌టీ లైన్లున్న చోట విద్యుత్ కోతలతో నిర్దేశిత ఆయకట్టులో పావువంతుకు కూడా ప్రయోజనం చేకూరడం లే దు. ఎల్‌టీ లైన్లకు ఉచితవిద్యుత్ ఇస్తున్నామనే సాకుతో కోత లు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. హెచ్‌టీ లైన్లున్న లిఫ్టులను వి ద్యుత్‌బిల్లుల బకాయిలు వెంటాడుతున్నాయి. ఈ యేడాది జూన్ నుంచి (రాష్ట్ర విభజన జరిగిన తర్వాత) లిఫ్టుల విద్యుత్ బకాయిలు జిల్లాలో రూ.10 కోట్ల మేర పేరుకుపోయినట్టు ఐడీసీ అధికారులు చెబుతున్నారు.

 చోరీలతో రైతులు బెంబేలు

 గతంలో ఐడీసీ ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, ఇతర సామగ్రి చాలాచోట్ల చోరీకి గురయ్యాయి. సొంతంగా డబ్బు లు పోగు చేసి తిరిగి యంత్ర సామగ్రి కొనుగోలు చేసినా రక్షణ లేకుండా పోయింది. మరోవైపు కాల్వల పూడికతీతకు నిధులు లేకపోవడంతో క్రమం గా ఆయకట్టు కూడా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో లిఫ్టులు మూతపడుతున్నా సొసైటీలు నిస్సహాయతను వ్యక్తం చే స్తున్నాయి. లిఫ్టులు మూతపడిన చోట కొందరు రైతులు సొంతంగా మోటార్లు కొనుగోలు చేసి కృష్ణా తీరాన ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు ఆయిల్ ఇంజన్లతో సాగు కొనసాగిస్తుండడంతో రైతులపై ఆర్థికభారం పెరుగుతోంది.

 యంత్రసామగ్రి చోరుల పాలు

 మక్తల్ మండలంలో సాగునీరందించేందుకు 1987లో రూ.76లక్షలతో కృష్ణానదిపై పస్పుల ఎత్తిపోతల పథకం నిర్మిం చారు. 3,500ఎకరాలకు రెండు దశల్లో నీటిని లిఫ్ట్ చేసేందుకు మొదటి దశ పంప్‌హౌస్‌లో ఐదు, రెండోదశలో మూడు మోటార్లు ఏర్పాటు చేశారు.

 





 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top