విద్యావ్యవస్థ నాశనం: ఉత్తమ్‌

విద్యావ్యవస్థ నాశనం: ఉత్తమ్‌ - Sakshi


 టీఆర్‌ఎస్‌కు కొందరు ఉద్యోగ నేతల దాసోహం

వారితో ఉద్యోగులకు నష్టం

 టీఎస్‌టీఎఫ్‌ డైరీ ఆవిష్కరణ




సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌  విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శిం చారు. తెలంగాణ స్టేట్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీఎస్‌టీఎఫ్‌) డైరీ–2017, కేలండర్‌ను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో కలసి గాంధీభవన్‌లో సోమవారం  ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరఫున పోరాటాలు చేసి హక్కులను సాధిం చాల్సిన యూనియన్‌ నాయకులు కొందరు వ్యక్తిగత స్వార్థంకోసం ఉద్యోగుల, ఉపాధ్యా యుల హక్కులను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా కొందరు నేతలు తమ పదవుల కోసం, పైరవీల కోసం టీఆర్‌ఎస్‌కు, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.


కేసీఆర్‌ పేదలకు విద్యను అందకుండా చేయాలనే కుట్రతో వ్యవహరిస్తున్నారని ఉత్తమ్‌ ఆరోపిం చారు. భట్టివిక్రమార్క మాట్లాడుతూ విద్యా రంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధా నాలు, నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యా యులు ఇబ్బందులను ఎదుర్కొం టున్నారని విమర్శించారు. పొన్నాల మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి వి.సునీతా లక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌ మహిళా విభాగం అధ్యక్షు రాలు నేరెళ్ల శారద, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



కోదండరాం పార్టీ పెట్టకపోవచ్చు

 ప్రొఫెసర్‌ కోదండరాం కొత్తగా పార్టీ పెడతారని అనుకోవడం లేదని ఉత్తమ్‌ అభిప్రాయ పడ్డారు.  తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమించినట్టు గానే, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా సమస్యల పరిష్కారం కోసం   పోరాడుతున్నారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరు పోరాడినా  వారికి మద్దతు ఇస్తామని చెప్పారు.  



తుగ్లక్‌ ఆడియో సీడీ ఆవిష్కరణ

తుగ్లక్‌ కరెన్సీ కష్టాలు అనే సినిమా ఆడియో సీడీని గాంధీభవన్‌లో ఉత్తమ్‌ ఆవిష్కరించారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తుగ్లక్‌ పాలన సాగుతున్నదన్నారు. పెద్ద నోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ పెద్ద తుగ్లక్‌ అయితే, రద్దును స్వాగతించిన సీఎం చిన్న తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top