తెలంగాణలో నిశ్శబ్ధ విప్లవం

తెలంగాణలో నిశ్శబ్ధ విప్లవం - Sakshi


కేసీఆర్‌ పాలనకు కౌంట్‌డౌన్‌ షురూ: ఉత్తమ్‌

2019లో కాంగ్రెస్‌కే అధికారం ఖాయమని ధీమా




హుజూర్‌నగర్‌: తెలంగాణలో నిశ్శబ్ధ విప్లవం ప్రారంభమైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సోమవారం జరిగిన జన ఆవేదన సమ్మేళనం సభలో ఆయన మాట్లా డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేయ లేని హామీలు గుప్పించి పచ్చి అబద్ధాలతో కాలయాపన చేస్తున్నారని, దీంతో ప్రజా వ్యతిరేకత మొదలైందని చెప్పారు. తన సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రుణమాఫీ పథకాన్ని ఏక కాలంలో అమలు చేయకపోవడంతో ప్రభు త్వం విడుదల చేస్తున్న డబ్బు వడ్డీలకే సరిపోతోందని చెప్పారు.


విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయ డంలేదని, ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యవ సాయ వ్యతిరేక విధానాల వల్ల ఇప్పటికే ఆహార ఉత్పత్తులు సగానికి పడిపోయాయని చెప్పారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన సీఎం.. తన కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నా రన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో నిర్మాణం చేపట్టిన విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేసుకుంటూ గొప్పగా చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు.


ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటాలు సాగించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ పాలనకు చరమగీతంపాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. సమా వేశంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతి, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top